చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోం మామూలే. కానీ.. ఇక్కడ అంతా భిన్నంగా. ఊహాకు ఏ మాత్రం రాని ఒక వ్యవహారాన్ని వ్యాపారంగా మార్చేసి దండుకుంటున్న వీరి వైనం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండే సెలబ్రిటీలను.. ఉత్తరప్రదేశ్ లోని కొందరు గొర్రెల వ్యాపారులు రోటీన్ కి భిన్నంగా సెలబ్రిటీలనే తమ ఉత్పత్తుల పేర్లుగా పెట్టేసుకొని కాసులు కొల్లగొడుతున్నారు.
యూపీలోని పలువురు గొర్రెల యజమానులు డుంబా.. అజ్మెరీ జాతికి చెందిన గొర్రెలకు కాస్తంత చిత్రమైన పేర్లు పెట్టేశారు. కస్టమర్ లను ఆకర్షించేందుకు వీలుగా వారు తమ మేకలకు సల్మాన్.. షారూక్.. సానియా మీర్జా లాంటి పేర్లు పెట్టేసి ఆకర్షించేస్తున్నారు. బక్రీద్ సందర్భంగా మేకలకు గిరాకీ ఎక్కువగా ఉండటంతో వారీ సెలబ్రిటీల పేర్లతో సక్సెస్ ఫుల్ గా అమ్మకాలు సాగిస్తున్నారట.
ఇక్కడి మేకలు కాస్తంగా ప్రత్యేకం అని చెబుతుంటారు. ఇక్కడి సంతకు తీసుకొచ్చే మేకలకు బాదం.. తేనె.. ఆకుకూరలు పెట్టి పోషిస్తారని చెబుతారు. వీటి ధర ఒక్కొక్కటి రూ.15వేలు మొదలు కొని రూ.లక్ష వరకూ ఉండటం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది ఈ పేర్లకు మాండ్ భారీగా ఉందని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని నక్కాన్ ప్రాంతంలోని ఓల్డ్ సిటీలో జరుగుతున్న ఈ వ్యాపారం వ్యాపారులకు మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతుందంటున్నారు. మొత్తానికి సెలబ్రిటీలను బకరాలు చేయటం యూపీ వ్యాపారులకే చెల్లిందని చెప్పాలి.