తన దారిన తాను వెళుతున్న ఒక మహిళను దారుణంగా హింసించి.. వేళ్లను.. చేతుల్ని నరికేసి మరీ గ్యాంగ్ రేప్ చేయటమే కాదు.. ఉన్మాదంతో హత్య చేసిన సమత వ్యవహారం ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే. దిశ హత్యాచార ఉదంతాని కి కేవలం రెండు రోజుల ముందు జరిగిన ఈ దారుణానికి మొదట్లో పెద్దగా ప్రాచుర్యం లభించలేదు.
దళిత మహిళ కు ఘోరమైన హాత్యాచారం జరిగితే మీడియా ఎందుకు ప్రయారిటీ ఇవ్వరన్న ప్రశ్న ఎదురు కావటంతో పాటు.. బాధితురాలు దళిత మహిళ కావటంతోనే చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి తగ్గట్లే మీడియాలోనూ ఈ ఉదంతాన్ని అప్రాధాన్య వార్తగా పక్కన పెట్టేశారు. దిశ హత్యాచార ఉదంతం హైలెట్ గా మారిన వేళ.. సమత హత్యాచారం ఎందుకని ఎవరూ పట్టించుకోరన్న ప్రశ్న సోషల్ మీడియాలో మొదలైంది.
అలా ప్రశ్నల తో మొదలైన సమత హత్యాచార ఉదంతానికి సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ షురూ అయ్యింది. ఈ కేసును వాదించేందుకు న్యాయవాదులు ఎవరూ ముందుకు రాకపోవటంతో కోర్టు రహీం అనే లాయర్ ను ఏర్పాటు చేసింది.
ఇదిలా ఉంటే తాము నేరం చేసినట్లుగా ఆరోపిస్తున్నారు కానీ.. తాము నేరం చేసినట్లుగా ఆధారాలు.. సాక్ష్యాలు లేవని.. అందుకు ఈ కేసుల నుంచి తమను డిశ్చార్జ్ చేయాలని వారు కోరుకుంటున్నట్లు లాయర్ రహీం తెలిపారు. ఇదిలా ఉంటే.. ఈ కేసుకు సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నట్లుగా అసిఫాబాద్ జిల్లా ఎస్పీ మల్లారెడ్డి దాఖలు చేశారు. దీంతో హత్య కేసుతో పాటు.. మరికొన్ని సెక్షన్లను అదనంగా చేర్చారు. అనుకుంటాం కానీ దారుణమైన తప్పులు చేసి.. కించిత్ పశ్చాతాపం కూడా లేకుండా తాము తప్పులు చేయలేదని.. ఆధారాల్లేవు కాబట్టి తమను వదిలేయాలన్న నిందితుల వాదన చూస్తే.. తప్పులు చేసి మరీ తప్పుకోవాలనుకుంటున్న తీరు భయానకంగా అనిపించక మానదు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.