రష్యా కు షాక్ ఇచ్చిన శాంసంగ్.. ఉత్పత్తులు బంద్

Update: 2022-03-05 13:30 GMT
ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ దేశాలు వద్దని వారించినా సరే రష్యా దాడులకు దిగడం తో ఇప్పటికే అనేక ఆంక్షలను ఎదుర్కొంటుంది రష్యా. కేవలం నాటో దేశాలు మాత్రమే కాకుండా ఇతర దేశాలు కూడా రష్యా  చేస్తున్న సైనిక చర్యను తప్పు పడుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా ఉండే పలు కీలక సంస్థలు కూడా రష్యాకు షాక్ ఇస్తున్నాయి.
 
ఉక్రెయిన్ పై యుద్దం ప్రకటించిన కారణంగా శాంసంగ్ కంపెనీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రష్యాలో తమ సంస్థకు సంబంధించిన  ఉత్పత్తులను విక్రయించేంది లేదని తేల్చి చెప్పింది. ఆ దేశానికి  తాము ఉత్పత్తి చేస్తున్న ఫోన్ లను కానీ, గ్యాడ్జెట్స్ ను కానీ, ఇతర వస్తువులను కూడా నిలిపి వేస్తున్నట్లు పేర్కొంది.

ఇప్పటికే యాపిల్ , మైక్రోసాఫ్ట్ లాంటి అంతర్జాతీయంగా మంచి పేరున్న సంస్థలు వాటి ఉత్పత్తులను  రష్యాలో విక్రయించకుండా ఆపేశాయి. ఈ క్రమంలోనే కొరియాకు చెందిన శాంసంగ్ కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
 
ఉక్రెయిన్ లో ఉన్న పరిస్థితులపై కూడా శాంసంగ్ కీలక ప్రకటన చేసింది. ఆ దేశంలో  ప్రస్తుతం ఉన్న పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని తెలిపింది. ఎలక్ట్రానిక్‌ లో ఉన్న చిప్స్‌  దగ్గర నుంచి అనేక ఉత్పత్తులను నిలిపి వేస్తున్నట్టు పేర్కొంది.

ఇప్పటికే రష్యాలో ఉన్న స్మార్ట్‌ఫోన్లు,  కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ తో పాటు  ఇతర అన్ని ఉత్పత్తులను కూడా నిలిపి వేస్తున్నట్లు ఓ ప్రకటనలో  చెప్పుకొచ్చింది. రష్యా  చేస్తున్న  దాడుల  కారణంగా ప్రపంచంలోని చాల మంది  ప్రభావితం అవుతున్నామని  తెలిపింది. దీని కారణంగా శాంసంగ్ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులకు రక్షణ కల్పిచడం  తమ కర్తవ్యం అని స్పష్టం చేసింది.

అంతే గాకుండా ఉక్రెయిన్ కు  భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది శాంసంగ్. వీటితో పాటు ఓక మిలియన్ కు సరిపడా.. ఎలక్ట్రానిక్స్ వస్తువులను అందిస్తామని పేర్కొంది.

    

Tags:    

Similar News