తయారీ లోపాల కారణంగా కార్లను రీకాల్ చేయటం పలుమార్లు విన్నాం. తాజాగా ఒక ఖరీదైన ఫోన్ విషయంలో రీకాల్ మాటను వినే పరిస్థితి. ప్రఖ్యాత మొబైల్ దిగ్గజం శాంసంగ్ ఇటీవల గ్రాండ్ గా విడుదల చేసిన గెలాక్సీ నోట్ 7లో సాంకేతిక సమస్యలు చోటు చేసుకోవటం.. ఈ ఫోన్ ఛార్జింగ్ కు పెట్టినప్పుడు పేలుతున్న వైనాన్ని సదరు కంపెనీ సీరియస్ గా తీసుకుంది. ‘నోట్ 7’పై ఫిర్యాదులు రోజు రోజుకూ పెరిగిపోతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా అమ్మిన ఈ ఫోన్లను వెనక్కి తీసుకోవాలని కంపెనీ భావించింది.
తమకు తమ వినియోగదారుల భద్రత ముఖ్యమని.. తమపై ఎంతో నమ్మకంతో ఫోన్లను కొనుగోలు చేసిన వారికి ఎలాంటి ఇబ్బంది రానివ్వమంటూ.. తమ భారీ రీకాల్ ను శాంసంగ్ ప్రకటించింది. గెలాక్సీ నోట్ 7 ఫోన్ ను రీకాల్ చేయాలన్న నిర్ణయం కంపెనీ మీద ప్రభావం చూపించినా.. కంపెనీ పెద్దగా పట్టించుకోలేదు. తమ నుంచి నాణ్యమైన ఉత్పత్తులు మాత్రమే వస్తాయన్న సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని శాంసంగ్ భావిస్తోంది. దాదాపు రూ.65వేల ఖరీదుతో ఉన్న ఈ ఫోన్ గత నెల 10న విడుదలైంది.
విడుదలైన నాటి నుంచి ఈ ఫోన్ పై పలు ఫిర్యాదులు వస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఛార్జింగ్ పెడుతుంటే ఫోన్లు పేలిపోతున్నాయన్న ఫిర్యాదు వినియోగదారుల్లో భయందోళనల్నినింపింది. మొత్తం విడుదల చేసిన ఫోన్లలో 0.1 శాతం మేర లోపాలు ఉండే అవకాశం ఉందన్న మాటను కంపెనీకి చెందిన వివరాలు వెల్లడించటానికి ఇష్టపడని ఒక ప్రతినిధి అభిప్రాయ పడుతున్నట్లుగా చెబుతున్నారు. ఏది ఏమైనా.. ఖరీదైన ఫోన్ మీద వచ్చిన ఫిర్యాదులపై శాంసంగ్ స్పందించిన తీరు మార్కెట్ వర్గాల్లో చర్చగా మారింది. మరి.. మీరు వాడుతున్నది గెలాక్సీ నోట్ 7 అయితే.. ఆలస్యం చేయకుండా కంపెనీకి తిరిగి ఇచ్చేందుకు సిద్ధం కండి.