శాంసంగ్ నోట్ 7 అతడి జేబులో పేలింది

Update: 2016-09-19 22:30 GMT
బ్యాటరీ లోపం కారణంగా టపాకాయలు పేలినట్లుగా పేలుతున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 తాజాగా అమెరికాలో పేలిపోయింది. ఫ్లోరిడాలోని బీచ్ గార్డెన్ కు చెందిన జోనాథన్ స్ట్రోబెల్ అనే వ్యక్తి  జేబులో నోట్ 7 పేలిపోయింది. షాట్ వేసుకొని పనిలో ఉన్న వేళ.. పెద్ద శబ్ధంతో పేలిపోవటంతో ఆయనకు గాయాలయ్యాయి.

నిక్కర్ జేబులో ఉన్న ఫోన్ పేలిపోవటంతో పెద్ద షాక్ కు గురైన అతను.. తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర గాయాల నేపథ్యంలో అతనికి వైద్య సాయాన్ని అందిస్తున్నారు. ఈ ఫోన్లోని లోపం గురించి తెలిసినప్పటికీ శాంసంగ్ నిర్లక్ష్యం చేసిందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కంపెనీ నిర్లక్ష్యంపై కోటి రూపాయిల నష్టపరిహారం కేసును జోనాథన్ తరఫు న్యాయవాదులు ఫైల్ చేశారు.

మరోవైపు జోనాథన్ నిక్కరులో పేలిన ఫోన్ ను తమకు అప్పగించాలంటూ శాంసంగ్ తాజాగా కోరింది. గెలాక్సీ నోట్ 7 ఫోన్లు విడుదల చేసిన కొద్దికాలానికి పేలిపోతున్నాయన్న ఆరోపణలురావటం.. ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసిన నోట్ 7 ఫోన్లను రీకాల్ చేస్తూ అధికారికంగా ప్రకటించింది. పేలిపోతున్న నోట్ 7 ఫోన్ల తీరును అప్రమత్తం చేస్తూ ఈమొయిల్స్ ను శాంసంగ్ పంపుతోంది. ఏమైనా.. పేలుతున్న నోట్ 7 తీరుపై శాంసంగ్ వినియోగదారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News