సంచయితతో వైసీపీకి తలనొప్పులు?

Update: 2020-10-03 17:50 GMT
టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిని అణచాలనే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం ఏరికోరి తెచ్చుకున్న గజపతిరాజుల ఆడపడుచు సంచయిత నిర్ణయాలు, వ్యాఖ్యలు రచ్చ రచ్చ అవుతున్నాయి. గుట్టుగా సాగాల్సిన మాన్సాస్ ట్రస్టు నియామకాలన్నీ చైర్మన్ సంచయిత రట్టు చేస్తూ మీడియాకు ఉప్పందిస్తున్నారు. టీడీపీ మీడియా రెచ్చిపోవడానికి కారణమవుతున్నా విమర్శలు తెచ్చుకున్నారు.మాన్సాస్ చైర్ పర్సన్ అయిన సంచయితీ తీసుకున్న అన్ని నిర్ణయాలను ఆమె ప్రభుత్వం ఆమోదం తీసుకునే లోపే వివాదాస్పదమవుతూ లీక్ అవుతుండడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.

విజయనగరంలోని పూసపాటి గజపతి రాజవంశీయులకు చెందిన మాన్సాస్ ట్రస్ట్ లో గతేడాది వరకు చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజును పక్కనపెట్టి సంచాయిత గజపతి రాజుకు బాధ్యతలు తీసుకున్నారు? ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం ఏరికోరి ఆమెను నియమించింది. దాంతోపాటు అప్పన్న దేవస్థానం చైర్ పర్సన్ గా కూడా ప్రభుత్వం నియమించింది.

అయితే సంచయిత మాన్సాస్ తోపాటు దేవాదాయశాఖలో తనకున్న పరపతి వాడుకుంటూ ఓ నిర్ణయంపై ప్రతిపాదన రాగానే దాన్ని మీడియాకు లీక్ చేసేస్తున్నారు. దీంతో సంజయితతోపాటు ప్రభుత్వం కూడా ఇరుకునపడుతోంది.

మాన్సాస్ ట్రస్టులో ప్రక్షాళన కోసం ప్రయత్నిస్తున్న సంచయిత గజపతిరాజు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీటిలో కొన్ని వారసత్వ సంప్రదాయాలను సైతం పక్కనపెట్టి తీసుకుంటున్నారు. సంస్కరణలు చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే లీకుల కారణంగా ట్రస్టు ప్రతిపాద స్థాయిలోనే అంశాలు వివాదాస్పదంగా మారిపోతున్నాయి.

ఇప్పటికే లీకుల భయంతోనే ఇద్దరు అధికారులకు మాన్సాస్ ట్రస్టు దస్త్రాలు పంపడమే సంచయిత మానేసింది. తాజాగా స్పెషల్ కమిషనర్ కే నేరుగా దస్త్రాలు పంపుతోంది.ఈసారైనా లీకులకు అడ్డుకట్ట పడుతుందా అన్న చర్చ జరుగుతోంది.
Tags:    

Similar News