బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ బెయిల్ ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్ వచ్చింది. బెయిల్ గడువు శనివారం నాటితో ముగియడంతో మున్నాభాయ్ మళ్లీ జైలుబాట పట్టారు. ముంబయిలోని తన నివాసం నుంచి పూణలోని యరవాడ జైలుకు తిరిగి వెళ్లారు. 1993 ముంబయి వరుస పేలుళ్లకు సంబంధించి అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడనే కారణంగా సంజయ్ శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. సంజయ్ కుమార్తె ముక్కుకు సర్జరీ చేస్తుండడంతో బెయిల్‌పై బయటకు వచ్చారు.
అయితే గడువు ముగుస్తున్న నేపథ్యంలో బెయిల్ పునరుద్ధరణకోసం ఆయన మహారాష్ర్ట గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావుకు విన్నవించుకోగా...ఆయన పిటిషన్‌ను తిరస్కరించారని ఆ రాష్ర్ట రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. కానీ ఈ వార్తలను సంజయ్ దత్ తోచిపుచ్చారు. తాను లేదా తన కుటుంబ సభ్యులు ఎవరూ బెయిల్ కోసం అభ్యర్థించలేదని సంజయ్ దత్ తెలిపారు. తన బెయిల్ విషయంలో వెలువడిన వార్తలన్నీ నిరాధారమైనవని తెలిపారు. మొత్తంగా బెయిల్ గడువు ముగిసిపోవడంతో సంజయ్ తిరిగి జైలుకు వెళ్లక తప్పలేదు.