నెటిజన్ కు సారా టెండూల్కర్ సాలిడ్ కౌంటర్

Update: 2021-04-18 01:30 GMT
భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తెకు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ను ను ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా న్ స్టా గ్రామ్ లో సారా పోస్ట్ చేసిన  ఓ ఫొటోపై  ఓ మహిళా ఫాలోవర్ ఘాటు కామెంట్ చేసింది. దీనికి సారా అదే రేంజ్ లో గట్టి కౌంటర్ ఇచ్చింది.

ఇంతకీ వివాదం ఏంటంటే సారా టెండూల్కర్ ఏప్రిల్ 16న కారులో కాఫీ తాగుతున్న ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. 'బ్లూ టోకై కాఫీ ప్రాణాలను కాపాడుతుంది' అంటూ ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. దీనికి భారీ లైక్స్, షేర్స్, కామెంట్స్ వచ్చాయి.అయితే ఓ మహిళా ఫాలోవర్ మాత్రం ఆమెను ట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. సారా తన తండ్రి డబ్బును వృథా చేస్తున్నట్లు సదురు మహిళా ఫాలోవర్ కామెంట్ పెట్టారు.

దీనికి సారా సీరియస్ అయ్యింది. ఆమె చేసిన కామెంట్ ను స్క్కీన్ షాట్ తీసి స్పెషల్ కౌంటర్ ఇచ్చింది. 'కెఫిన్ కోసం ఖర్చు చేసిన డబ్బు వృథా కాదు.. ఇది సరైన పనే' అని పేర్కొంది.ఇదే మహిళ గతంలో సారా సోదరుడు అర్జున్ ను కూడా ట్రోల్ చేసింది. ఇప్పుడు సారా వెంట పడింది.
Tags:    

Similar News