భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్ కు ముందు ఎంత హాట్ హాట్ చర్చలు జరిగాయో.. మ్యాచ్ అయ్యాక అంతకు రెట్టింపు అంశాలు.. విశేషాలు ఒక్కొక్కటిగా తెర మీదకు వస్తున్నాయి. తాజాగా పాక్ క్రికెట్ జట్టు కెప్టెన్ సర్పరాజ్ మేనమామ తాను భారత్ గెలవాలని కోరుకున్నట్లుగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎక్కడైనా తమ మేనల్లుడు కెప్టెన్ గా ఉన్న టీం గెలవాలని ఏ మేనమామ అయినా కోరుకుంటారు. కానీ.. సర్ప్ రాజ్ మేనమామ మాత్రం అందుకు భిన్నంగా చెప్పాలి. తాజాగా తాను మ్యాచ్ లో భారత్ గెలవాలని భావించానని.. పాక్ కెప్టెన్ మంచి ఆటగాడైనప్పటికీ.. భారత్ లో మంచి ప్లేయర్లు ఉన్నారన్నారు.
సర్పరాజ్ మేనమామ సైతం భారత్ గెలవాలనుకోవటం వెనుక మరో ఆసక్తికర అంశం ఉంది. ఆయన 1995 నుంచి ఉత్తరప్రదేశ్ లోని ఇటావాలో ఉంటున్నారు. బాబా సాహెబ్ బీమ్ రావ్ అంబేడ్కర్ కృషి కాలేజీలో పని చేస్తున్న ఆయన.. తన మేనల్లుడి జట్టు ఓడాలని.. భారత్ గెలవాలని కోరుకోవటం ఆసక్తికరంగా మారింది.
ఎందుకలా అంటే.. పాక్ జట్టుతో పోలిస్తే భారత్ జట్టులోనే మంచి ప్లేయర్లు ఉన్నట్లుగా వెల్లడించారు. ఏమైనా ఇలాంటి ఆశీస్సులు.. ఆకాంక్షలే పాక్ మీద భారత్ అద్వితీయమైన విజయానికి కారణమయ్యాయని చెప్పక తప్పదు.