అమ్మ సమాధి దగ్గర ‘కసి’ కళ శపధం ఇదేనా?

Update: 2017-02-15 08:18 GMT
అంతులేని ఆవేశంతో ఉన్నప్పుడు.. ప్రస్తుతం తమకు ఎదురైన పరిస్థితికి భవిష్యత్తులో తామేం చేయనున్నది శపధంతో చెప్పటం మామూలే. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయిన టీటీడీపీ నేత రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళుతున్న వేళ.. మీసం తిప్పి.. తొడ కొట్టి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కు ఇలాంటి పరిస్థితినే తీసుకొస్తానంటూ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. సినిమాల్లో శపధం సీన్లలో.. తొడ కొట్టటం.. మీసం మెలేసి ఆవేశపూరితంగా వ్యాఖ్యలు చేయటం.. ఆడవాళ్లు అయితే.. జుట్టు ముడి విప్పనని.. జుట్టుకు ముడి వేయనని రకరకాల శపధాలు చూస్తుంటాం.

కానీ.. కనివిని ఎరుగని రీతిలో.. ఒక సమాధిపై బలంగా కొట్టి మరీ శపధం చేసే విచిత్రమైన విధానాన్ని జనాలకు పరిచయం చేశారు చిన్నమ్మ అలియాస్ శశికళ. అక్రమాస్తుల కేసులో దోషిగా నిరూపితమై.. నాలుగేళ్ల జైలుశిక్ష అనుభవించేందుకు బెంగళూరుకు బయలుదేరే ముందు.. అమ్మ సమాధికి వద్దకు వెళ్లిన ఆమె.. సమాధికి నమస్కరించి.. నోటితో ఏదో పలుకుతూ.. సమాధి మీద బలంగా చరచటం తెలిసిందే.

ఆ సందర్భంగా ఆమె నోటి నుంచి వచ్చిన మాటలేంది? అన్నది సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. లిప్ మూమ్ వెంట్ ను గుర్తించేందుకు అనువుగా ఉన్న వేళ.. కొందరు నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. అమ్మ నోటి నుంచి వచ్చిన మాటలు ఇవే అయి ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త తరహాలో శపధం చేసిన చిన్నమ్మ.. అమ్మ సమాధి మీద కొడుతూ.. చెప్పిన మాటల్ని ఏమిటన్నది చూస్తే..

1.        పార్టీని విచ్ఛిన్నం కానివ్వను.

2.         నేను ఎక్కడున్నా.. నా ఆత్మ ఎప్పుడూ సమాధి చుట్టూనే ఉంటుంది.

3.        ద్రోహుల్ని వదిలిపెట్టను.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News