రిసార్ట్స్ నుంచి ఐదుగురు బయటకొచ్చి మాట్లాడారు

Update: 2017-02-10 18:34 GMT
శశికళ వర్గానికి చెందిన ఎమ్మెల్యేల పరిస్థితి స్కూలు పిల్లల మాదిరి తయారైంది. చిన్నమ్మ పిలించింది కదా అని పార్టీ ఆఫీసుకు వెళ్లి.. ఆమెపై ఉన్నఅభిమానాన్ని పైపైకి ప్రదర్శించాలని అనుకున్న వారికి.. పార్టీ ఆఫీసు నుంచే నేరుగా బస్సుల్లో ఎక్కించి మహాబలిపురానికి దగ్గర్లోని ద్వీపం లాంటి రిసార్ట్స్ లో కి తీసుకెళ్లిన వైనంతో షాక్ తిన్న పరిస్థితి. అయినా.. ఏమీ అనలేక చిన్నమ్మచెప్పినట్లుగా ఎంజాయ్ చేస్తున్న వారికి చాలా చిత్రమైన శిక్షలు విధించారట. మొబైల్ ఫోన్లు పని చేయకుండా జామర్లు.. న్యూస్ పేపర్లు అందుబాటులోకి రాకుండా చేయటమే కాదు.. న్యూస్ చానళ్లు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారట.

ప్రతి పావు గంటకు ఒకసారి ఎమ్మెల్యేగారు ఏం చేస్తున్నరో చిన్నమ్మకు చెందిన ప్రైవేటు సైన్యం ఎప్పటికప్పుడు ఓ కంట కనిపెడుతున్నారట. గతంలో ఇలాంటి క్యాంపులు పెడితే ఓపట్టాన బయటకు వచ్చేవి కావు. ఈ మధ్య కాలంలో పెరిగిన మీడియా చొరవతో.. ఎట్టకేలకు చిన్నమ్మ  క్యాంప్ ను పట్టేయటంతో.. మీడియా లైవ్ బళ్లు బిలబిలా మంటూ రిసార్ట్స్ దగ్గరకు చేరిపోయాయి. అక్కడి నుంచి లైవ్ ల మీద లైవ్ లు ఇస్తూ.. శశికళ వర్గాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి.

ఇలాంటి అవకాశం కోసమే చూస్తున్న పన్నీర్.. చిన్నమ్మ చేతిలో బంధీలుగా ఉన్న ఎమ్మెల్యేల్ని తీసుకురావాలంటూ డీజీపీని ఆదేశించటంతో.. ఆయనే స్వయంగా రంగంలోకి దిగనున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ..అలాంటిదేమైనా జరిగితే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని గుర్తించిన చిన్నమ్మ.. తనకు నమ్మకస్తులైన ఐదుగురు ఎమ్మెల్యేల్ని రిసార్ట్ బయటకు వచ్చారు. తాము చాలా ఫ్రీగా ఉన్నామంటూ చెప్పిన వారు.. మాటల్లో భాగంగా ఏ విషయాన్ని అయితే చెప్పకూడదో అదే చెప్పేసి.. తాము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేయటం గమనార్హం

రిసార్ట్స్ లోపల చాలా స్వేచ్ఛగా ఉన్నామని.. తమను ఎవరూ నిర్బంధించలేదని చెప్పుకొచ్చారు. అంతవరకూ బాగానే ఉన్నా.. అక్కడే అసలు విషయం బయటకు వచ్చేసింది. గోల్డెన్బే రిసార్ట్స్ లో తాము ఎన్నాళ్లు ఉంటామో తాము చెప్పలేమని చెప్పేశారు. చిన్నమ్మ తమను బంధించి ఉంచారంటూ కొందరు  ఎమ్మెల్యే నిరాహార దీక్ష చేస్తున్నట్లుగా వస్తున్నవార్తల్ని కొట్టిపారేశారు. ఒకవేళ.. అంత స్వేచ్ఛే ఉండి ఉంటే.. ఐదుగురుఎమ్మెల్యేలు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడేకన్నా.. మీడియా మొత్తాన్ని ఖరీదైన రిసార్ట్స్ లోపలకు అనుమతిచ్చి ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తే సరిపోయేది కదా? స్వేచ్ఛతో ఉండి ఉంటే.. ఎప్పుడు బయటకు వస్తామన్న విషయాన్ని ఎందుకు స్పష్టంగా చెప్పలేకపోతున్నారన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోవటం గమనార్హం.
Tags:    

Similar News