ట్వీట్ల‌తో ఆ సీఎంను కుమ్మేస్తున్నారుగా!

Update: 2018-05-02 05:14 GMT
ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడే వారెంత త్వ‌ర‌గా చుల‌క‌న అవుతారో తెలియాలంటే త్రిపుర ముఖ్య‌మంత్రి.. బీజేపీ నేత బిప్ల‌వ్‌ ను బెస్ట్ ఎగ్జాంఫుల్ గా చూపించొచ్చు. తాను చేస్తున్న వ్యాఖ్య‌ల‌తో పార్టీకి.. ప్ర‌భుత్వానికి ఎంత ఇబ్బందిక‌రంగా ఉంటుంద‌న్న విష‌యాన్ని మ‌రిచిపోయి మ‌రీ ఆయ‌న ఒక దాని వెంట మ‌రొక‌టి అన్న‌ట్లుగా చేస్తున్న వ్యాఖ్య‌లు త్రిపుర ముఖ్య‌మంత్రిని న‌వ్వుల‌పాలు అయ్యేట‌ట్లు చేస్తున్నాయి.

ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోడీ సైతం గుర్రుగా ఉన్నార‌ని.. త‌న‌ను క‌ల‌వాలంటూ అల్టిమేటం జారీ చేసిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సీఎం బిప్ల‌వ్ చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై ఆన్ లైన్ వేదిక‌గా చేసుకొని సామాన్యులు స‌టైర్ల మీద స‌టైర్లు వేస్తున్నారు.

సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫాం మీద త్రిపుర సీఎం ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌గా మారారు. మ‌హాభార‌త కాలంలోనే ఇంట‌ర్నెట్ ఉంద‌ని.. మెకానిక‌ల్ ఇంజ‌నీర్లు కాకుండా సివిల్ ఇంజ‌నీర్లు మాత్ర‌మే సివిల్ స‌ర్వీసెస్ ను ఎంచుకోవాల‌ని.. ఎందుకంటే రెండింటిలోనూ సివిల్ ఉదంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు కామెడీగా మారాయి.

సీఎం వ్యాఖ్య‌ల‌పై ట్విట్ట‌ర్ ను వేదిక‌గా చేసుకొని ప‌లువురు చేస్తున్న వ్యాఖ్య‌లు ఇప్పుడు న‌వ్వులు పూయిస్తున్నాయి.  బిప్ల‌వ్ మాట‌లకు సామాన్యులు విసురుతున్న వ్యంగ్య పంచ్ ల్లో ఆస‌క్తిక‌ర‌మైన‌వి కొన్ని చూస్తే..

=  మెకానికల్‌ ఇంజనీర్లు మెకానిక్స్.. కెమికల్‌ ఇంజనీర్లు కేవలం కెమెస్ట్స్‌ కావాలి

= హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ హిల్‌ స్టేషన్లలో మాత్రమే చేయాలి

= సింగ్‌లు మాత్రమే సింగర్లు కావాలి

= వర్జిన్స్‌ మాత్రమే వర్జిన్‌ ఏర్‌లైన్స్‌లో ప్రయాణించాలి

=.లీవ్స్‌ కోసం ట్రీస్‌ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి

= బస్టాప్‌ లో బస్సు దొరికినప్పుడు.. ఫుల్‌ స్టాప్‌ లో ఫుల్‌ ఎందుకు దొరకదు?

= ఇండియానా జోన్స్‌ ఇండియన్‌ ఎందుకు కాదు?

= హిప్సోస్‌ కు మాత్రమే హిప్స్‌ ఉంటాయి

= ఫిజిక్స్‌ డిగ్రీవారే ఫిజిషియన్లు అవుతారు

= జీబ్రాలు మాత్రమే బ్రాలు వేసుకోవాలి


Tags:    

Similar News