శ్వేతజాతి దురహంకారానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తం చేస్తున్న పరోక్ష మద్దతుపై ఆ దేశంలో నిరసన రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా ఈ జాబితాలో ప్రముఖ సాఫ్ట్ వేర్ - సోషల్ నెట్ వర్కింగ్ సంస్థలు మైక్రోసాఫ్ట్ - యాపిల్ - ఫేస్ బుక్ ల సీఈఓలు జత కలిశారు. గతవారం వర్జీనియాలోని చార్లాట్స్ విల్ల్లేలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న వారిపైకి కారు దూసుకురావటం, ఆ ఘటనలో ఒక మహిళ మరణించటాన్ని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తీవ్రంగా ఖండించారు. భయానకమైన ఘటనగా దానిని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు తమ సంస్థ ఉద్యోగులకు ఒక నోట్ పంపారు. ``వర్జీనియాలో ఇటీవల శ్వేతజాతీయులు రెచ్చగొట్టిన పక్షపాతానికి - అంధవిశ్వాసాలకు - విచక్షణారహిత హింసకు మన సమాజంలో తావు లేదు. వైవిధ్యతకు మైక్రోసాఫ్ట్ అత్యంత విలువనిస్తుంది. ఈ సమయంలో ప్రజలతో మనం కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. అందరికీ అవకాశాలను కల్పించే, గౌరవాన్ని ఇచ్చే, అందరిపట్లా సానుభూతిని చూపే సమున్నత సమాజాన్ని నిర్మించటానికి సమిష్టిగా పని చేద్దాం`` అని చెప్పారు.
మరోవైపు ట్రంప్ తీరును యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా ఖండించారు. ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్ లో శ్వేతజాతి దురహంకారులను - వారిని వ్యతిరేకిస్తూ మానవ హక్కుల కోసం పోరాడేవారిని ఒకే గాటన కట్టాలన్న అధ్యక్షుడి అభిప్రాయంతో నేను విభేదిస్తున్నాను అని పేర్కొన్నారు. ఫేస్ బుక్ సీఈఓ మార్క్‌జుకెర్ బర్గ్ కూడా.. తన అభిప్రాయాల్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ``మన (ఫేస్ బుక్) వేదికలో విద్వేషానికి స్థానం లేదు. కాబట్టే, ద్వేషపూరితమైన నేరాలను - ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించే పోస్టులకు ఫేస్ బుక్ లో స్థానం కల్పించటం లేదు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా భావించే వేదికగా ఫేస్ బుక్ ను నిలపటానికి జరుగుతున్న కృషిని కొనసాగిస్తాం`` అని చెప్పారు. ట్రంప్ వైఖరిని అమెరికా మాజీ అధ్యక్షులైన తండ్రీ కుమారులు జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ - జార్జ్ డబ్ల్యూ బుష్ కూడా ఒక ప్రకటనలో ఖండించారు. జాతిపరమైన అంధవిశ్వాసాలను - వివక్షను - విద్వేషాన్ని అమెరికా ఎల్లప్పుడూ తిరస్కరిస్తూ ఉండాలి అని పిలుపునిచ్చారు. మరోవైపు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతున్నా కూడా ట్రంప్ తన ధోరణిని మార్చుకోవటం లేదు. రెండు వ్యాపార సలహా మండళ్లను ఆయన రద్దు చేశారు. వీటిలో స్ట్రాటెజిక్ అండ్ పాలసీ ఫోరం - వైట్ హౌస్ మాన్యుఫాక్చరింగ్ జాబ్స్ ఇన్షియేటివ్ ఉన్నాయి. ట్రంప్ తీరును వ్యతిరేకిస్తూ ఈ మండలుల నుంచి ఇంద్రానూయి (పెప్సీ) - మేరీ బారా (జనరల్ మోటార్స్) తదితర ప్రముఖ వ్యాపారసంస్థల అధిపతులు రాజీనామా చేసిన నేపథ్యంలో - వీటిని పూర్తిగా రద్దు చేయాలని ట్రంప్ నిర్ణయించారు.
అమెరికాలో పెరుగుతున్న శ్వేతజాతి దురంహకారాన్ని అమెరికా సైన్యానికి చెందిన ఐదుగురు అత్యంత సీనియర్ అధికారులు ఖండించారు. అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కు చెందిన జనరల్ రాబర్ట్ నెల్లర్ (కమాండెంట్ ఆఫ్ అమెరికా మెరైన్ కార్ప్స్) - అడ్మిరల్ జాన్ రిచర్డ్ సన్ (చీఫ్ ఆఫ్ నావల్ ఆపరేషన్స్) - జనరల్ మార్క్ మిల్లే (చీఫ్ ఆఫ్ ది స్టాఫ్ ఆఫ్ ది ఆర్మీ) - జనరల్ డేవ్ గోల్డ్ ఫీన్ (ఎయిర్ ఫోర్స్) - జోసెఫ్ లెంగ్యెల్ (నేషనల్ డార్డ్ బ్యూరో అధిపతి) శ్వేతజాతీయుల చర్యలను వ్యతిరేకిస్తూ బహిరంగంగా వ్యాఖ్యానించారు. దేశంలో జాతివివక్ష - తీవ్రవాదం వంటివి పెరగటం 1775 నుంచీ అమెరికా పాటిస్తున్న విలువలకు వ్యతిరేకమని - దీనిని అమెరికా సైన్యం ఎట్టిపరిస్థితుల్లోనూ సహించదని పేర్కొన్నారు. ఈ విధంగా సైన్యానికి చెందిన అత్యంత సీనియర్ అధికారులు అధ్యక్షుడి వైఖరిపై స్పష్టంగా వ్యతిరేకతను ప్రదర్శించటం అమెరికా చరిత్రలోనే అరుదైన విషయం.