ర‌జనీకి క‌ట్ట‌ప్ప భారీ పంచ్‌

Update: 2018-06-06 07:00 GMT
రాజకీయాలు మ‌హా క‌రుకుగా ఉంటాయి. ఎలాంటి వ్య‌క్తి మీద‌నైనా స‌రే విరుచుకుప‌డ‌తాయి. అందుకే.. సున్నిత మ‌న‌స్కులు రాజ‌కీయాల్లోకి రావొద్ద‌న్న స‌ల‌హా ఇస్తుంటారు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఆలోచ‌న ఏదీ త‌న‌కు లేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించినంత కాలం త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ను ప‌ల్లెత్తు మాట అనేందుకు సాహ‌సించేవారు కాదు. కానీ.. ఎప్పుడైతే పాలిటిక్స్ లోకి  రావ‌టం ఖాయ‌మ‌ని ర‌జ‌నీ పేర్కొన్నారో.. అప్ప‌టి నుంచి ఆయ‌న‌పై దాడి మొద‌లైంది.

ర‌జ‌నీని విమ‌ర్శించే వారు అంత‌కంత‌కూ పెరుగుతున్నారు. ఆయ‌న త‌ప్పుల చిట్టా విప్పేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. పార్టీ ప్రారంభం ముందే విమ‌ర్శ‌ల తీవ్ర‌త ఇంత‌లా ఉంటే.. ఇక పార్టీ స్టార్ట్ చేసిన త‌ర్వాత ఆయ‌న్ను వేలెత్తి చూపించే వారు ఇంకెంత పెరుగుతారో అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. తాజాగా ప్ర‌ముఖ సినీ న‌టుడు.. క‌ట్ట‌ప్ప‌గా దేశ వ్యాప్తంగా సుప‌రిచితుడైన సీనియ‌ర్ న‌టుడు స‌త్యరాజ్ ర‌జ‌నీపై సంచ‌ల‌న విమ‌ర్శ‌లు చేశారు.

ర‌జ‌నీ రాజ‌కీయ నాయ‌కుడు ఎంత‌మాత్రం కాద‌ని.. ఆయ‌న ఫ‌క్తు అధ్యాత్మిక వ్యాపార‌స్తుడ‌ని వ్యాఖ్యానించారు. రాజ‌కీయాలంటే ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్య‌క్షంగా సేవ చేసే మార్గ‌మ‌ని.. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నుకుంటే ముందు.. వెనుకా ఆలోచించ‌కూడ‌ద‌న్నారు. అయితే.. ర‌జ‌నీ తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంద‌ని త‌ప్పు ప‌ట్టారు.

"ర‌జ‌నీ రాజ‌కీయాల్లోకి రావాల‌న్న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌టానికి ఎన్నో సంవ‌త్స‌రాల స‌మ‌యాన్ని తీసుకున్నారు. అన్ని లెక్క‌లు వేసుకొని ప్రారంభించ‌టానికి ఇదేమీ వ్యాపారం కాదు. వ్యాపార‌స్తులు మాత్ర‌మే ప‌క్కా వ్యూహాల‌తో త‌మ వ్యాపారాల్ని ప్రారంభిస్తారు. మ‌న వ్యాపారం స‌జావుగా జ‌రుగుతుందా?  మ‌న ఉత్ప‌త్తికి మార్కెట్ ఉంటుందా?  లాంటి లెక్క‌లు వేసుకొని బ‌రిలోకి దిగుతారు. ర‌జ‌నీ కూడా అలాంటి లెక్క‌లు వేసుకొనే రాజ‌కీయాల్లోకి అడుగు పెడుతున్నారు" అంటూ తీవ్రస్థాయిలో త‌ప్పు ప‌ట్టారు.

ర‌జ‌నీ చేసేది రాజ‌కీయం కాద‌ని.. వ్యాపార‌మ‌ని అన్నారు. తాను అధ్యాత్మిక రాజ‌కీయాలు చేస్తాన‌ని ర‌జ‌నీ చెప్ప‌టం కామెడీగా ఉంద‌న్న క‌ట్ట‌ప్ప అలియాస్ స‌త్య‌రాజ్‌.. ర‌జ‌నీ ఒక నిర్ణ‌యం తీసుకునే ముందు ప్ర‌జ‌ల్ని సంప్ర‌దించి.. వారి అభిప్రాయాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే మంచిద‌ని  చెప్పారు. మ‌రి.. క‌ట్ట‌ప్ప వ్యాఖ్య‌ల‌పై "కాలా" ఎలా రియాక్ట్ అవుతారో?


Tags:    

Similar News