సౌదీ యువరాజును.. సౌదీలో ఉరి తీశారు

Update: 2016-10-19 05:19 GMT
నేరం చేసినోడి సంగతి తర్వాత.. నేరం చేయాలన్నఆలోచన వచ్చేందుకు సైతం వణుకు పుట్టించేలా ఉంటాయి సౌదీలో శిక్షలు. తప్పు చస్తే.. ఎంతటి వాడైనా సరే శిక్ష పడాల్సిందే అన్నట్లుగా ఉండే అక్కడి రూల్స్ కు తాజాగా సౌదీ యువరాజునే ఉరితీసిన ఘటన అక్కడ చోటు చేసుకుంది.తప్పు చేసినోడు ఎంతటి వాడైనా సరే.. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న విషయాన్ని స్పస్టం చేసిన వైనం సంచలనంగా మారింది.

2012లో సౌదీ యువరాజు టర్కిబిన్ సౌద్ అల్ కబీర్.. తన స్నేహితుడైన అదెల్ అల్ మహ్మద్ తో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ పెరిగి.. చివరకు తన మిత్రుడ్ని కాల్చి చంపేశాడు. హత్యా నేరం మోపి సౌదీ యువరాజు మీద విచారణ జరిపారు. ఈ ఉదంతంలో సౌదీ యువరాజు నేరం చేసినట్లు నిరూపితం కావటతో అతడికి ఉరిశిక్ష విధించారు. తాజాగా ఆ శిక్షను అమలు చేశారు. నేరం చేసిన వారికి కఠిన శిక్షలు విధించే సౌదీలో రాజకుటుంబానికి చెందిన వారికి ఉరిశిక్ష విధించటం అరుదైన వ్యవహారంగా చెబుతుంటారు.

ఇదిలా ఉంటే.. సౌదీలో అమలు చేస్తున్న ఉరిశిక్షలపై ప్రపంచ వ్యాప్తంగా పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటారు. సౌదీ యువరాజు కు విధించిన ఉరిశిక్షను మంగళవారం రియాద్ లో అమలు చేశారు. తాజా ఉరిశిక్ష అమలుతో ఈ ఏడాది ఉరితీసిన వారి సంఖ్య 134కు చేరుకున్నట్లు అధికారవర్గాలు చెబుతన్నాయి. చట్టం ముందు ఎవరైనా ఒక్కటే అన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా తాజా శిక్ష అమలు ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News