జిందాల్ గ్రూప్ చైర్ పర్సన్ సావిత్రి జిందాల్ (72) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జిందాల్ వ్యాపార మహా సామ్రాజ్యాన్ని ఒంటిచేత్తో నడుపుతున్నారామె. భర్త ఓపీ జిందాల్ 17 ఏళ్ల కిందటే విమాన ప్రమాదంలో దుర్మరణం పాలవగా నాటి నుంచి సంస్థల బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. 70 ఏళ్ల వయసులోనూ సంస్థలను విజయవంతంగా నడిపిస్తూ వస్తున్నారు.తాజాగా ఆమె ఆసియాలోనే అత్యంత ధనికురాలైన మహిళగా ఆవిర్భవించారు.
చైనా సంపన్నురాలిని వెనక్కునెట్టి మనకంటే ఎన్నో రెట్లు వ్యాపార, వాణిజ్య పరంగా ఎదిగింది చైనా. ఆ దేశానికి చెందిన యాంగ్ హుయాన్ ఇప్పటివరకు ఆసియా ధనవంతురాలిగా ఉన్నారు. ఆమెను తాజాగా సావిత్రి వెనక్కునెట్టారు. ప్రస్తుతం ఆమె ఆస్తి 11.3 బిలియన్ డాలర్లు.
భారత కరెన్సీలో 90 వేల కోట్ల రూపాయిలు. వాస్తవానికి జనవరిలో సావిత్రి సంపద 13.3 బిలియన్ డాలర్లు. అప్పటికి హుయాన్ ఆస్తి కూడా 13.0 బిలియన్ డాలర్లే. అయితే, అనూహ్యంగా ఇద్దరూ ఆ జూలైకి సంపద కోల్పోయారు. ప్రస్తుతం యాంగ్ హుయాన్ ఆస్తి కూడా 11.3 బిలియన్ డాలర్లే అయినా..సావిత్రి కంటే ఇది కొంత తక్కువ.
ఇద్దరి నేపథ్యమూ ఒక్కటే..సావిత్రి జిందాల్, యాంగ్ హూయాన్ ఇద్దరి నేపథ్యమూ ఒక్కటే తీరు. 2005లో భర్త ఆకస్మిక మరణంతో మెటల్ , స్టీల్, పవర్ జనరేషన్ లో ఉన్న జిందాల్ గ్రూప్ ను సావిత్రి వ్యాపార పగ్గాలను చేపట్టగా, అదే ఏడాది తండ్రి స్థానంలో యాంగ్ హూయాన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వచ్చింది.
చాన్నాళ్లుగా ఈమెనే ఆసియా ధనికురాలిగా ఉన్నారు. ముఖ్యంగా గత ఐదేళ్లుగా యాంగ్ దే అగ్రస్థానం. ప్రపంచంలో అత్యంత చిన్న వయసు బిలియనీర్ కూడా ఆమెనే. చైనా రియాల్టీ రంగం వేగవంతమైన ప్రగతితో యాంగ్ సంపద పెరుగుతూ పోయింది. అయితే, చైనాలో రియాల్టీ రంగంలో కొన్నాళ్లుగా నెలకొన్న సంక్షోభంతో ఆమె సంపద తగ్గింది.
సావిత్రి.. అత్యంత సాదాసీదా..వేల కోట్ల వ్యాపారానికి అధినేత్రి.. ఏళ్లుగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థలకు చీఫ్.. అన్నిటికి మించి పలుకుబడి, పేరు ప్రతిష్ఠలున్న కుటుంబం.. కానీ, సావిత్రి జిందాల్ మాత్రం అత్యంత సాదాసీదాగా ఉంటారు. డబ్బు ఉందన్న ధోరణి ఆమె మాటల్లో కానీ, ఆహార్యంలో కానీ ఎక్కడా కానరాదు. హై ప్రొఫైల్ జీవితానికి చాలా దూరంగా ఉన్నట్లు కనిపిస్తారు సావిత్రి. అంతటి వ్యాపార సామ్రాజ్యానికి అధినేత్రి అయినా.. సగటు భారతీయ మహిళలాగా కనిపించండం ఆమె గొప్పదనం.