మహమ్మారి వైరస్ కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. 2 నెలలు అన్నీ మూతబడడంతో అభివృద్ధి కుంటుపడింది. ప్రజల వద్ద రూపాయి లేని పరిస్థితి ఏర్పడింది. కేంద్రం ప్రకటించిన 20లక్షల కోట్ల ప్యాకేజీ ఉట్టి గాలిబుడగ అని తేలిపోయింది. దీంతో కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు నింపడం ఎలా అనే మీమాంస నెలకొంది.
కరోనా లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంత నష్టం చేకూరిందనే దానిపై తాజాగా ఎస్.బీ.ఐ ఎకోరావ్ ఓ అంచనా రిపోర్ట్ ను వెల్లడించింది. ప్రతీ రాష్ట్రంలో జిల్లాల వారీగా.. జోన్ల వారీగా అంచనావేసింది. మహమ్మారి కారణంగా రాష్ట్రాలు మొత్తంగా రూ.30.3 లక్షల కోట్ల మేర నష్టపోయాయి. మొత్తం జీఎస్.డీపీలో ఇది 13.5శాతం అని రిపోర్టులో వెల్లడించారు. కేంద్రం ప్రకటించిన 20లక్షల కోట్ల ప్యాకేజీ కంటే ఈ నష్టం మరో 50శాతం ఎక్కువ అని తేల్చింది.
మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో జీఎస్.డీపీ నష్టం ఎక్కువగా ఉందని.. ఈ రాష్ట్రాల నుంచి జీడీపీ కంట్రిబ్యూషన్ గణనీయంగా పడిపోయిందిన తెలిపింది. మొత్తం జీడీపీ నష్టంలో టాప్ 10 రాష్ట్రాల నుంచే 75శాతం నష్టం నమోదైందని రిపోర్టులో తేలింది. మహారాష్ట్ర నుంచి 15.6శాతం జీఎస్డీపీ తగ్గగా.. తమిళనాడు నుంచి 9.4శాతం, గుజరాత్ నుంచి 8.6శాతం తగ్గిందని తెలిపింది.
ఎస్.బీ.ఐ ఎకోరావ్ ఇచ్చిన నివేదికలో రెడ్ జోన్లలో ముంబై, ఢిల్లీ వంటి అగ్రనగరాలు ఉండడంతో ఆర్థిక నష్టం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఈ త్రైమాసికంలో 40శాతానికి పైగా ఉంటుందని పేర్కొంది.