సాంకేతకంగా రోజురోజుకీ అద్భుతాలు సృష్టిస్తున్న మనిషి.. రెండు విషయాల్లో మాత్రం ఇప్పటికి విజయం సాధించలేకపోయారని చెప్పాలి. ఆ మాటకు వస్తే.. విజయం సంగతి తర్వాత.. ఆ దరిదాపుల్లోకి వెళ్లలేదని చెప్పాలి. అందులో ఒకటి చావును జయించటం ఒకటైతే.. రెండోది కాలంలో పాటు మీద పడే వయసును తగ్గించటం. ఈ రెండింటిని తన అదుపులోకి తీసుకురావాలని తపించే మనిషి.. మొదటి విషయంలో విజయంసాధించకున్నా.. రెండో విషయంలో మాత్రం విజయానికి సంబంధించిన తొలి అడుగులు వేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.
కాలంతో పాటు మీద పడే వయసును ఎప్పటికప్పుడు తగ్గించుకుంటే ఎంత బాగుండన్న ఆశ చాలామందిలో ఉంటుంది. కానీ.. అది సాధ్యమయ్యే పని కాదు. ఈ లక్ష్యాన్ని చేధించేందుకు శాస్త్రవేత్తలు ఎంతోకాలంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఇలా ప్రయత్నం చేస్తున్న అమెరికాలోని సాల్క్ ఇనిస్టిట్యూట్ అధ్యయనకారులు విజయం సాధించారని చెప్పాలి. రివర్స్ ఏజింగ్ పై వారు నిర్వహించిన పరిశోధనలో కొంతమేర విజయం సాధించారని చెప్పాలి.
రివర్స్ ఏజింగ్ పై తాము నిర్వహిస్తున్న పరిశోధనల్ని తొలుత.. ఎంపిక చేసుకున్న కొన్ని ఎలుకలపై పరీక్షలు నిర్వహించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పరిశోధనల కోసం ఎంపిక చేసుకున్న ఎలుకల జీవితకాలాన్ని 30 శాతం పెంచటంలో వారు సక్సెస్ అయ్యారు. బ్రేక్ త్రూ టెక్నిక్ ను ఉపయోగించటం ద్వారా శరీర కణాల్ని రీ ప్రోగ్రామ్ చేయటం ద్వారా ఇప్పటివరకూ కొరుకుడు పడని అంశంపై విజయం సాధించే దిశగా అడుగులు వేశారని చెప్పాలి. తాజా విజయంతో.. అదే పనిగా పెరుగుతూ పోయే వయసును వెనక్కి తీసుకొచ్చే మార్గం దొరికిందని చెప్పక తప్పదు. ఈ పరిశోధనలో మరింత విజయం సాధిస్తే.. మానవ పరిణామ క్రమంలో మరో అద్భుతం సాధించినట్లేనని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/