తిమింగాలు, సొర చేపలు తప్ప మనుషులపై పడి ప్రాణాలు తీసే సాహసం ఇంకే సముద్ర జీవికీ ఉండదు. కానీ... ఒక సాధారణ సీల్ చేప వల్ల ఒక బాలిక ప్రాణాలు పోయినంత పనైంది. బాలికపై దాడి చేసి నీటిలోకి లాగేసిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇంతకీ విషయం ఏంటంటే.. కెనడా పశ్చిమ తీరంలోని వాంకోవర్ పట్టణం రిచ్‌మండ్ బీచ్‌లో శనివారం ఒక అమ్మాయి.. డాక్‌పై కూర్చుని నీటిలో పైకి తేలి తిరుగుతున్న సీల్ ను చూసి సరదా పడుతుండగా అది బాలిక కూర్చున్న డాక్ వరకు వచ్చింది. దాంతో బాలిక మరింత ముచ్చటపడింది. అంతలోనే ఆ సీల్ ఒక్కసారిగా వైల్డ్ గా మారి బాలిక దుస్తులను పట్టుకుని నీళ్లలోకి లాగేసింది. దీంతో అక్కడున్నవారంతా భయంతో కేకలు వేయగా ఓ వ్యక్తి తెగించి నీటిలో దూకి బాలికను కాపాడాడు. బాలిక ప్రాణాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నా సీల్ చేపలు కూడా ఇంత భయంకరంగా ప్రవర్తిస్తాయా అని ఆశ్చర్యపోతున్నారు.
ఊహించని ఈ ప్రమాదాన్ని అక్కడున్న ఓ విద్యార్థిని వీడియో తీసింది. నీటిలో తేలియాడుతున్న క్షీరదానికి ఆహారం వేసేందుకు సందర్శకులు ప్రయత్నించారని, ఇంతలోనే బాలికపై అది దాడి చేసిందని ఆమె చెప్తోంది. బాలిక డ్రెస్ ను కూడా ఫుడ్ అనుకుని దాన్ని పట్టి లాగిందని... బలంగా లాగడంతో అమ్మాయి నీటిలో పడిపోయిందని చెప్తున్నారు.
Full View