రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పదవీకాలం మార్చి 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఎల్టీసీపై వెళ్లేందుకు గవర్నర్ అనుమతి కోరాడు. ఎల్టీసీ విషయంలో నిమ్మగడ్డ ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అవి మళ్లీ మారినట్టు తెలిసింది.
తాజాగా గవర్నర్ హరిచందన్ ను కలిసి నిమ్మగడ్డ మున్సిపల్ ఎన్నికలపై వివరించారు. మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్ల ఎన్నికల కోసం ఏర్పాట్లు చేసినట్టు వివరించారు.
ఈ క్రమంలోనే ఎల్టీసీపై వెళ్లేందుకు గవర్నర్ అనుమతి కోరారు. మార్చి 22 నుంచి 24వరకు ఆయన ఎల్టీసీపై వెళ్లేందుకు గవర్నర్ హరిచందన్ నుంచి అనుమతి కోరారు.
తొలుత మార్చి 17-21వరకు నాలుగు రోజుల పాటు తీసుకోవాలని భావించారు. మార్చి 18న మేయర్ ఎన్నిక కారణంగా వాయిదా వేసుకున్నారు. మార్చి 19-22 వరకు ఎల్టీసీపై వెళ్లేందుకు తాజాగా గవర్నర్ కు లేఖ రాశారు. దీనికి గవర్నర్ అనుమతిచ్చినట్టు తెలిసింది.
మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ ఏం చేస్తారనేది ఆసక్తి నెలకొంది. ఆయన పదవీకాలం నెలఖారుతో ముగియడం ఎల్టీసీపై వెళుతుండడంతో ప్రాధాన్యత నెలకొంది.