దేశంలో కరోనా మహమ్మారి జోరు ఓ రేంజ్ లో కొనసాగుతుంది. మొదటి వేవ్ తో పోల్చితే ఈ సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి అనేది చాలా ఎక్కువగా ఉంది. దీనితో మళ్లీ చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. అలాగే దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా ఆంక్షలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అమెరికా వీసాలపై కూడా పడింది. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో ఇక్కడి నుంచి వచ్చే వారికి ఆ ప్రభుత్వం వీసాలను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కీలక ప్రకటన జారీ చేసింది. యూఎస్ కన్సలేట్ నుంచి జారీ అయ్యే అన్ని సాధారణ వీసా సర్వీసులతో పాటు రొటీన్ నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూ అపాయింట్ మెంట్, ఇంటర్వ్యూ వేవర్ అపాయింట్ మెంట్ వీసాలను మే 3 నుంచి నిలిపి వేస్తున్నట్లు కన్సలేట్ జనరల్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
కరోనా కారణంగా అన్ని రకాల సాధారణ అమెరికన్ సిటిజన్ సర్వీసెస్ అపాయింటెమెంట్ లను ఈ నెల 27 నుంచే రద్దు చేసినట్లు తెలిపారు. అయితే, అత్యవసర అమెరికన్ సిటిజన్ సర్వీసెస్ అండ్ వీసా అపాయింట్ మెంట్ లు మాత్రం కొనసాగుతాయని ఆ ప్రకటన తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని కన్సలేట్ జనరల్ విడుదల చేసిన ప్రకనటలో వివరించారు . అత్యవసరాలపై ఇప్పటికే తీసుకున్న ఇంటర్వ్యూ తేదీలను యథావిధిగా సాధ్యమైనంత మేరకు అనుమతిస్తామని పేర్కొంది. హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు సేవలందిస్తుంది.