సెకండ్ వేవ్ : హాంకాంగ్ కీల‌క నిర్ణ‌యం, ఆ విమానాలు ర‌ద్దు !

Update: 2021-04-19 08:37 GMT
భారతదేశంతో పాటుగా ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. రోజు రోజుకు కరోనా ఉధృతి రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ‌భార‌త్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్న క్ర‌మంలో హాంకాంగ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.ఈ నెల 20వ తేదీ నుంచి మే 3 వ‌ర‌కు భార‌త్ మీదుగా హాంకాంగ్ వెళ్లే విమానాల‌న్నింటినీ ర‌ద్దు చేసింది. ముంబై నుంచి హాంకాంగ్ వెళ్లే విమానాలన్నింటినీ ఏప్రిల్‌ 20నుంచి మే2 వరకూ రద్దు చేస్తున్నట్లు  ప్రకటించింది.

ఈ తేదీల్లో పాకిస్తాన్, ఫిలిఫీన్స్ నుంచి బ‌య‌ల్దేరే విమానాల‌పై కూడా నిషేధం విధించింది. ఈ నెల‌లో రెండు విస్తారా విమానాల్లో ప్ర‌యాణించిన 50 మంది ప్ర‌యాణికుల‌కు క‌రోనా సోక‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు హాంకాంగ్ ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఈ మేరకు ఆదివారం కీలక ప్రకటన వెల్లడించింది. ఆర్టీపీసీఆర్ ఫలితంలో 72గంటల ముందు నెగెటివ్ వస్తేనే ప్రయాణించాల్సి ఉంది. అంతకంటే ముందు ఢిల్లీ నుంచి హాంకాంగ్ వెళ్లే విమానాల్లోని ప్రయాణికులకు 47మంది వరకూ పాజిటివ్ వచ్చింది. దీంతో ఏప్రిల్ 6నుంచి ఏప్రిల్ 19వరకూ ఆ మార్గంలోని విమానాల రాకపోకలు నిలిపివేసిన సంగతి  తెలిసిందే.
Tags:    

Similar News