పెళ్లి అంటే రెండు కుటుంబాల మధ్య వారధే కాదు. సకల వృత్తులవారికి ఉపాధి కూడా. కొన్ని లక్షల రూపాయల వ్యాపారం. ఎంతో మందికి బతుకుదెరువు. ఒక్క వివాహం ఎన్నో కుటుంబాలకు ఉపాధినిస్తుంది. బాజాభజంత్రీలు, తళుకులీనే వర్ణరంజిత విద్యుద్దీపాలు, పెళ్లి మండపాల్లో అలంకరణలు, విందు భోజనాలు, స్వర్ణాభరణాలు, నూతన వస్త్రాలు, వంటింటి సామగ్రి కొనుగోళ్లు, ఇలా చెబుతూ పోతే ఈ జాబితా చాంతాడంత అవుతుంది. ఇంత తతంగం ఉంటుంది పెళ్లంటే. ప్రతియేటా ఏప్రిల్ మే నెలలో బాజాభజంత్రీలతో అట్టహాసంగా సాగే పెళ్లి వేడుకల దృశ్యాలే ప్రస్తుతం కనిపించడంలేదు. 70 రోజులపాటు శుక్రమూఢమి కొనసాగి మే 1వ తేదీ నుంచి ముహూర్తాలు ప్రారంభం అవ్వబోతున్నాయి అని అనుకున్న ఈ సమయంలో పెళ్లి వేడుకలపై కూడా కరోనా ప్రభావం పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. చప్పట్లు తాళాలు తలంబ్రాలు, మూడే ముళ్లు..ఏడే అడుగులు, అంతేనా పెళ్లంటే ఒక సామాజిక జీవితం. రెండు జీవితాలు ముడిపడి ఒక్కటయ్యే వేళ, వినిపించే బాజాభజంత్రీలు, మంగళవాయిద్యాలు, గుబాళించే పూలసౌరభాలు, రంగురంగుల విద్యుద్దీపాలు, కనువిందు చేసే పెళ్లిమండపాల అలంకరణ, పసందైన విందు భోజనాలు, తళుకులీనే వస్త్రాభరణాలు,బంధుమిత్రుల రాకపోకలు.సందడిగా కనిపించే రహదారులు. కానీ, కరోనా తో గత ఏడాది పెళ్లిళ్ల సీజన్ మొత్తం ఎగిరిపోయింది. కరోనా తక్కువ ఉన్న సమయంలో ముహుర్తాలు లేవు. ఇప్పుడు వైశాఖమాసంలో మే 1వ తేదీ నుంచి మంచి ముహూర్తాలు ఉండడంతో ముందస్తుగానే వధూవరుల తల్లిదండ్రులు భారీగా ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. అమలాపురం పట్టణంతోపాటు కోనసీమవ్యాప్తంగా ఉన్న కల్యాణ మండపాలు, ఫంక్షను హాళ్లు, హోటళ్లతోపాటు షామియానాలు, పూల డెకరేష న్లు, వంట పనివారలు, అనేక రకాల ఈవెంట్లకు అధిక మొత్తాల్లో అడ్వాన్సులు చెల్లించి ఖరారు చేసుకున్నారు.
గతంలో కరోనాతో వాయిదా పడ్డ పెళ్లిళ్లు సైతం ఈ ముహూర్తాల్లో అంగరంగ వైభవంగా జరపాలని నిర్ణయించుకున్నప్పటికీ కరోనా మరో సారి అడ్డుపడే అవకాశం ఉంది. దీనితో వివిధ ఈవెంట్ల మేనేజర్లు ఆవేదన చెందుతు న్నారు. లక్షల్లో అడ్వాన్సులు చెల్లించామని, ఇప్పుడు తిరిగి ఇమ్మన్నా వచ్చే పరిస్థితి లేదని వధూవరుల తల్లిదండ్రులు వాపోతున్నారు. గతేడాది కరోనా పరిస్థితులను ప్రత్యక్షంగా చూడడంతోపాటు ప్రస్తుతం తీవ్రరూపం దాల్చుతున్న పరిస్థితుల నేపథ్యంలో పెళ్లిళ్లు నామమాత్రం గానే జరుపుకునేందుకు సిద్ధం కావాల్సిందిగా అధికారులు సూచిస్తు న్నారు. ఇప్పటికే దేవుళ్ల కల్యాణాలు, శ్రీరామనవమి వేడుకలు వంటివి రద్దు అయిన నేపథ్యంలో పెళ్లిళ్లపై కూడా కరోనా ఆంక్షలు తీవ్ర ప్రభా వం చూపనున్న దృష్ట్యా వివాహ వేడుకలతో ముడిపడి ఉన్న అన్ని వర్గాలవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.