పవన్ మెడలో తాయత్తు.. సీక్రెట్ ఏంటి?
పవన్ కళ్యాణ్ లో కూడా నమ్మకాలు పెరిగిపోయాయి. జనసేనకు గాజు గ్లాస్ గుర్తు వచ్చాక ఆయన భార్యపిల్లలతో కలిసి పూజల్లో పాల్గొన్నట్టు వినికిడి. అప్పుడే మెడలో కొత్తగా తాయత్తు ప్రత్యక్షమైందట.. ఆ తర్వాత క్రిస్మస్ వేడుకల కోసం విదేశాలకు కూడా వెళ్లినప్పుడు కూడా తాయత్తు మెడలోనే ఉన్నా ఎవ్వరూ గుర్తించలేదు. తాజాగా విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఈ విషయం వెలుగు చూసింది.
మూఢ నమ్మకాలు, మతవిశ్వాసాలకు దూరంగా ఉండే పవన్ కళ్యాన్ తాజాగా తాయత్తు కట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అప్పట్లో త్రివిక్రమ్ సలహా మేరకు జంధ్యం వేసుకున్నాడట.. ఆ జంధ్యంతోనే పూజలు, యజ్ఞాలు కూడా చేశారని వార్తలొచ్చాయి. ఇక సినిమాల్లో నటించేటప్పుడు కూడా కొన్ని ఉంగరాలు, చేతికి దారాలు కట్టుకొని అలరించాడు. కానీ నిజజీవితంలో మాత్రం పవన్ అలాంటివి ధరించలేదు. బయట కూడా ఆయన మెడలో బంగారు చైను కానీ ఎలాంటి దండలు ఉండేవి కావు.. మరి ఇప్పుడు సడన్ గా వచ్చిన ఆ తాయత్తు మహిమ ఏంటనే ప్రశ్న అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.
పవన్ కళ్యాణ్ లో కూడా మార్పు బాగానే వచ్చినట్టు కనిపిస్తోంది. కేసీఆర్ యాగాలు చేసి ఆ సెంటిమెంట్ తో సీఎం అయినట్టు.. పవన్ కూడా నమ్మకాలతోనే రాజకీయ ప్రయాణం కొనసాగిస్తున్నాడన్నది తాజా తాయత్తును బట్టి అర్థమవుతోంది. ఏదీ ఏమైనా పవన్ లో వచ్చిన ఈ కొత్త మార్పు ఆయన రాజకీయ మనుగడకు ఎంత ఉపయోగపడుతుందనేది వేచిచూడాల్సిందే..
Full View