హోటల్‌ గదిలో సీక్రెట్ కెమెరాలు ఎక్కడ పెడుతున్నారంటే?

Update: 2020-03-14 02:30 GMT
విహారయాత్రలకి వెళ్లడం అందరికి అలవాటే. ఎప్పుడైనా.. విహార యాత్రలకు - పని మీద దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు సాధారణంగా హోటళ్లలో స్టే చేస్తూంటారు. ఆ తరువాత అక్కడ పని అయిపోగానే , ఆ హోటల్ లో రూమ్ ఖాళీ చేసి - తిరిగి మన ప్రాంతానికి  వచ్చేస్తాం. ట్రిప్ అంతా బాగా జరిగింది కాదా.. అని అనుకుంటే , మీరు పప్పులో కాలేసినట్టే. ఈ సారి మీరు ఎక్కడికైనా హోటల్ లో  రూమ్స్‌ తీసుకున్నప్పుడు కొంచెం   నిశితంగా పరిశీలించండి. ఎక్కడో ఓ చోట సీక్రెట్ కెమెరాలు కనిపిస్తాయి.

ఎందుకంటే ఇటీవలే మహాబలేశ్వర్‌ లోని బడ్జెట్ హోటల్‌ నుంచి పోలీసులు ఎల్‌ ఈడీ బల్బ్‌లో ఫిక్స్ చేసిన ఓ సీక్రెట్ కెమెరాను సీజ్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే .. బడ్జెట్ హోటల్‌ లో దిగిన ఓ ప్రయాణికుడు కెమెరా ఉన్నట్లు అనుమానించడంతో ఈ విషయం బయటపడింది. ఈ విషయంపై హోటల్ సిబ్బందిని నిలదీయడంతో వారు బెదిరింపులకు దిగారు.

దీంతో ఆ ప్రయాణికుడు మహారాష్ట్ర పోలీసులకు ట్విట్టర్‌ లో ఈ విషయాన్ని తెలిపి ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసిన పోలీసులు - వెంటనే ఈ ఘటనపై స్పందించారు. కేసు నమోదు చేసుకుని.. విచారణ చేస్తున్నారు. అయితే హోటల్ నిర్వాహకులు మాత్రం - మా భద్రత కోసమే ఇలా చేశామని చెప్తున్నారు. ఏదేమైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ..మీరు దిగిన రూమ్ ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసాక మీ పనుల్లో బిజీ అయితే మంచిది. లేకపోతే ..సమస్యలు కొని తెచ్చుకున్నట్టే ...


Tags:    

Similar News