పుతిన్ జీవితం గురించి మీకు తెలియని రహస్యాలు

Update: 2022-03-03 03:30 GMT
ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు ‘పుతిన్’. ఇప్పుడీ ఆధునిక నియంత తన పొరుగు దేశం ‘ఉక్రెయిన్’పై యుద్ధానికి దిగడంతో వైరల్ అయ్యారు. మన మోడీ చాయ్ వాలా నుంచి దేశ ప్రధానిగా ఎదిగారు. కానీ రష్యా ఒకప్పడి ప్రధాని, ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఓ వంట చేసే వ్యక్తి మనవడు అంటే నమ్ముతారా?కానీ ఇది నిజం.

ఆయన తల్లిదండ్రులు ఎవరు? ఎక్కడ పుట్టారు? పుతిన్ గూఢాచారి నుంచి దేశ అధ్యక్షుడి వరకూ ఎలా ఎదిగాడన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నాజీలు పుతిన్ కుటుంబాన్ని సర్వనాశనం చేశారా? పుతిన్ కుటుంబం ఎందుకు రహస్యంగా ఉంటుందనే దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

రష్యాకు జీవిత కాల అధ్యక్షుడిగా మారిన పుతిన్ 1952 అక్టోబర్ 7న జన్మించారు. రష్యా గూఢచారిగా యూరప్ సహా పలు దేశాల్లో రహస్యంగా గడిపారు. అనంతరం సైన్యంలో కీలక పదవి అధిరోహించి రాజకీయంగా బలపడ్డారు.  2012 మే 7న రష్యా అధ్యక్షుడయ్యారు. 2000 నుంచి 2008 వరకు అధ్యక్షుడిగా కొనసాగిన పుతిన్.. ఆ తరువాత 2012 వరకు ప్రధానమంత్రిగా కొనసాగారు.

వాస్తవానికి రష్యా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడిగా రెండు పర్యాయాల  కంటే ఎక్కువగా కొనసాగడానికి వీళ్లేదు. కానీ 2008లో అధ్యక్ష పదవి నుంచి దిగిపోయినప్పటికీ ప్రధానమంత్రిని తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు. ఆ తరువాత తాను అధ్యక్షుడిగా ఎన్నికయ్యే వరకు జాగ్రత్తపడ్డాడు. ఈ సమయంలో నాలుగేళ్ల అధ్యక్షపదవి నుంచి ఆరేళ్లకు పెంచారు. అయితే 2021లో జరిగిన రాజకీయ పరిణాలతో పుతిన్ మరోసారి అధ్యక్షుడై జీవితకాలం ఉంటానని ప్రకటించుకున్నాడు.

యునైటెడ్ రష్యా పార్టీ తరుపున ఎన్నికల్లోకి దిగిన పుతిన్ కు 2021 ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించారు. మొత్తం 450 స్థానాలుండగా..  49.8 శాతం పుతిన్ పార్టీ విజయం సాధించింది. మరో పార్టీ రష్యా కమ్యూనిస్టు 19 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. దీంతో పుతిన్ పదవీ కాలం 2024 వరకు కొనసాగనుంది.

అయతే తాను జీవిత కాలం అధ్యక్షుడిగా ఉండేందుకు రాజ్యాంగాన్ని 12 ఏళ్లకు మార్చారు. ఈ మేరకు 2020 మార్చిలోనే ఆమోద ముద్ర వేయించుకున్నారు. ఈ సవరణలకు 43 మంది ఓట్లు వేయగా ఒక్క ఓటు కూడా వ్యతిరేకంగా పడలేదు. దీంతో పుతిన్ 2036 వరకు పుతిన్ అధ్యక్ష చైరులోనే ఉంటారు. అంటే ఆయన రిటైర్ అయితే తప్ప అధ్యక్ష పదవి నుంచి దిగిపోరన్నమాట.

దేశంలో ప్రతిపక్ష పార్టీ లేకుండా ముందే ప్లాన్ వేశాడు పుతిన్. అణిచివేత ధోరణితో తనకెవరు అడ్డూ రాకుండా క్రూరంగా వ్యవహరించేవాడని అంటారు. గత ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు పుతిన్ రిగ్గింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. కానీ అనేక సందర్భంగా పుతిన్ ఈ ఆరోపణల నుంచి తప్పించుకున్నారు.

దీంతో ప్రస్తుతం దేశంలో పుతిన్ పై వ్యతిరేకత ఉన్నా ఆయన అధ్యక్ష పదవి నుంచి దిగిపోలేని పరిస్థితి. రష్యా ఆఫ్ ద ప్యూచర్ పార్టీకి చెందిన అలెక్నీ నావల్ని మాత్రం ధైర్య సాహసాలతో పుతిన్ కు వ్యతిరేకంగా మారాడు. ఆయన పార్టీ రిజిస్టర్ కాలేకపోయినప్పటికి పుతిన్ ను ముప్పుతిప్పలు పెట్టాడు. అయితే 2020లో నావల్నీ పై విష ప్రయోగం జరిగినట్లు వార్తలు వచ్చాయి.

నావల్నీ సైబిరియా నుంచి మాస్కోకు తిరిగి విమానంలో వస్తుండగా మార్గ మధ్యంలో బాత్రూంకు వెళ్లి అపస్మారక స్థితిలో పడ్డాడు. అయితే ఆయన బోర్డింగ్ సమయంలో టీ తాగారని అక్కడే విష ప్రయోగం జరిగిననట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

పుతిన్ చేస్తున్న అవినీతిపై నావల్నీ వ్యతిరేకంగా ఉద్యమించాడు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ బలమైన నేతగా ఎదిగాడు. అయితే అలా ప్రజానాయకుడు చూసి ప్రభుత్వం ఓర్వలేకపోయింది. దీంతో అతన్ని మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేసి జైలుకు పంపింది. జైలులోనే ఉన్న నావల్నీ ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం.

రష్యా ప్రభుత్వంపై ఎవరు విమర్శలు చేసినా ఇలాంటి విష ప్రయోగాలే చేస్తారన్న విమర్శలు వస్తున్నాయి. 2018లో రష్యా గుడాఛారి సెర్గై స్క్రిపల్, అతని కూతురిపై కూడా ఈ విష ప్రయోగం జరిగినట్లు వార్తలు వచ్చాయి.
Tags:    

Similar News