గుంటూరు జిల్లా పల్నాడు గ్రామాల్లో ఉండలేని పరిస్థితులు ఉన్నాయంటూ - బాధితులంతా పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారని టీడీపీ ఆరోపిస్తుండటంతో అక్కడ 144 - 30 సెక్షన్ విధించామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఎన్నికత తర్వాత ఇప్పటివరకు 46 మందిపై రౌడీ షీట్లు - 36 మందిపై సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేసినట్టు డీజీపీ వివరించారు. అక్కడ పొలిటికల్‌గా హైటెన్షన్ వాతావరణం క్రియేట్ అయ్యింది. పల్నాడులోని మాచర్ల - గురజాల ప్రాంతాల్లో అధికార వైసీపీ నేతలు ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి అనుచరుల దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారంటూ టీడీపీ ఆరోపణలు చేస్తోంది. వైసీపీకి చెందిన వారు టీడీపీ కార్యకర్తలు - సానుభూతి పరులపై అకారణంగా భౌతిక దాడులకు దిగుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.
దీనికోసం టీడీపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన గుంటూరులో పునరావాస శిబిరాలు కూడా ఏర్పాటు చేసింది. వీటికి పోటీగా వైసీపీ కూడా గత ప్రభత్వం హాయంలో తమ కార్యకర్తలపై జరిగిన దాడుల్లో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారి కోసం పునరావాస శిబిరాన్ని ఏర్పాటు చేసింది. దీంతో పల్నాడులో 144 - 30 సెక్షన్ విధించామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
ఊరేగింపులు - ధర్నాలు - ప్రదర్శనలకు అనుమతి ఇవ్వబోమన్నారు. శాంతి భద్రతల విషయంలో అన్ని వర్గాలు - రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించాలని కోరారు. వినాయక నిమజ్జనం - మొహరం పండుగల నేపథ్యంలో ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పల్నాడులో ఎటువంటి అవాంచనీయ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని డీజీపీ తెలిపారు.
ఆత్మకూరు ప్రాంతంలో ప్రశాంతత :
ఆత్మకూరు ప్రాంతంలోనూ ప్రశాంత వాతావరణం నెలకొందని గురజాల డీఎస్పీ శ్రీహరి అన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఎస్సీల మధ్య గొడవలు జరిగాయని - అవన్ని కుటుంబ వివాదాలే అన్నారు. వాటితో రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పోలీసుల చొరవతో వారంతా కలిసిపోయారని - ఇప్పడు గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొందని శ్రీహరి తెలిపారు. ఇదిలా ఉంటే ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు - ఎంపీలు గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ ను కలిసి - టీడీపీ బాధితులకు న్యాయం చేసేందుకు చేపట్టబోయే ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.