ఏందీ ఎంపిక‌..జ‌ట్టు సెల‌క్ష‌న్ పై సౌర‌వ్ ఫైర్!

Update: 2019-07-25 04:42 GMT
టీమిండియాలో స‌భ్యుల ఎంపిక‌పై తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు జ‌ట్టు మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ. తాజాగా వెస్టిండీస్ టూర్ కోసం సెలెక్ట్ చేసిన జ‌ట్టు కూర్పుపై ఆయ‌న అసంతృప్తి వ్య‌క్తం చేశారు. సెల‌క్ట‌ర్ల తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టిన ఆయ‌న‌.. ఆట‌గాళ్లంద‌రినీ సంతోష‌పెట్ట‌టానికి క‌మిటీ ప్ర‌య‌త్నించింద‌న్నారు.

ఒక్కో ఫార్మాట్ కు ఒక్కో జ‌ట్టును ఎంపిక చేయ‌టం ఏమిటంటూ ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. గొప్ప జ‌ట్ట‌లో ఆట‌గాళ్లు ఎప్పుడూ స్థిరంగా ఉంటార‌ని.. పెద్ద‌గా మార్పులు చేయ‌ర‌న్న విష‌యాన్ని గుర్తు చేశారు. మూడు ఫార్మాట్ల‌లో స్థిరంగా రాణించిన వారే గొప్ప ప్లేయ‌ర్లు అవుతార‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌ద‌న్నారు.

కొంద‌రిని టెస్టు మ్యాచుల‌కే ప‌రిమితం చేయ‌టం స‌రైన నిర్ణ‌యం కాద‌న్నారు. శుభ్ మ‌న్ గిల్ కు చాన్స్ ఇవ్వ‌క‌పోవ‌టం స‌రికాద‌ని.. అజింక్యా ర‌హానే లాంటి ప్లేయ‌ర్ ను టెస్టుల‌కే ప‌రిమితం చేయ‌టం త‌ప్ప‌న్నారు. శుభ‌మ‌న్ లాంటి ఆట‌గాడికి ఎక్కువ అవ‌కాశాలు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఎంపిక తీరును సునిశితంగా త‌ప్పు ప‌డుతూ సార‌వ్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.
Tags:    

Similar News