కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతికి కరోనా పాజిటివ్

Update: 2020-09-27 07:10 GMT
కేంద్ర మాజీ మంత్రి - బీజేపీ నేత ఉమాభారతికి కరోనా పాజిటివ్‌ గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా నిర్ధారించారు. అర్ధరాత్రి ట్విట్టర్‌ లో పోస్టు చేశారు. మూడు రోజులుగా జ్వరం వస్తోందని.. టెస్టులు చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని తెలిపింది.

ఇటీవల హిమాలయ వెళ్లినప్పుడు కరోనా వైరస్‌ సోకినట్లు తెలుస్తోందని ఉమాభారతి వివరించారు. తనతో కాంటాక్టు అయినవారు ఐసోలేషన్‌ లో ఉండాలని అవసరమైతే చికిత్స తీసుకోవాలని సూచించారు.

ఇప్పటికే చాలామంది బీజేపీ నేతలు - ఎమ్మెల్యేలు - మంత్రులు - ఎంపీలు కరోనా బారినపడ్డారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 60 లక్షలకు చేరువలో కేసుల సంఖ్య ఉంది. నిన్న ఒక్కరోజే దేశంలో 88600 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 1124మంది మరణించారు.

వరుసగా దిగ్గజ నేతలు కరోనా బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరోనాతో అనారోగ్యం పాలయ్యారు. ఇప్పుడు ఉమాభారతి కూడా ఆ వ్యాధి బారినపడడం ఆందోళన కలిగిస్తోంది.
Tags:    

Similar News