గూండాలనుకునేరు.. వీరంతా విద్యార్థులు!

Update: 2016-10-14 04:25 GMT
నేటి విద్యార్థులే రేపటి పౌరులు - భావిభారత వెలుగుదివ్వెలు - భవిష్యత్ భారత ఆశాజ్యోతులు... విద్యార్థుల గురించి ఈ రేంజ్ లో మాట్లాడుకుంటూ ఉంటా. అభివృద్ది చెందుతోన్న దేశంగా ఉన్న భారత్ - అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి రేపు వారి తెలివితేటలు - వారి చదువులే ప్రధాన ఆధారం. అన్నింటికీ మించి వారి ప్రవర్తనే దేశ భవిష్యత్తు. ఇలాంటి విధ్యార్థులు ఏమి చేస్తున్నారో తెలుసా? వీది రౌడీలకు - సినిమాల్లోని విలన్ లకు ఏమాత్రం తీసిపోకుండా ప్రవర్తిస్తున్నారు. సినిమాల ప్రభావమో - పెంపకంలో లోపమో తెలియదు కానీ... కేరళలోని ఒక స్కూలు విద్యార్థులు మాత్రం రెచ్చిపోయారు - తరగతి గదిలోనే రౌడీలుగా మారిపోయారు!!

పాఠశాల విద్యార్థులు తరగతిగదిలోనే గుండాల తరహాలో వ్యవహరించిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది! ఓ విద్యార్థిని పట్టుకుని కొందరు విద్యార్థులు అత్యంత దారుణంగా చితకబాదారు. ముఖంపై, వీపు పై పిడిగుద్దులు గుద్దుతూ - ఉదరభాగంలో కాలితో తన్నుతూ వీరు చేసిన విన్యాశాలు అత్యంత దారుణంగా ఉన్నాయి. దీనికి సంబందించిన వీడియోను కేరళకు చెందిన ఓ ఐఏఎస్ అధికారి తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. అనంతరం... సంబంధిత అధికారులు - విద్యార్థుల తల్లిదండ్రులకు చేరేంతవరకు ఈ వీడియోను ఫార్వర్డ్ చేయాలంటూ ఫేస్‌ బుక్ - వాట్సప్‌ లలో కోరడంతో ఇది విపరీతంగా షేర్ అవుతోంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. అయితే... ఈ వీడియో ఏ స్కూల్ కి సంబంధించినది అనే విషయం స్పష్టంగా తెలియనప్పటికీ... స్టూడెంట్స్ ధరించిన యూనిఫాంను బట్టి చెప్పేవారు - ఈ ఘటన కేంద్రీయ విద్యాలయంలో చోటుచేసుకున్నట్లుగా భావిస్తున్నారు. స్కూలు విద్యార్థుల అమానుష ప్రవర్తనను బయటిప్రపంచానికి తెలిపేలా ఉన్న ఈ వీడియోపై సోషల్ నెట్ వర్క్స్ లో నెటీజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
Full View

Tags:    

Similar News