ప్రెగ్నెంట్ అంటూ క్రీడాలోకానికి స‌ర్ ప్రైజ్‌

Update: 2017-04-20 06:27 GMT
త‌న ఆట‌తో అంద‌రి మ‌న‌సుల్ని దోచుకోవ‌ట‌మే కాదు.. ఒక‌ద‌శ‌లో ఆమె ధాటికి ధీటుగా నిలిచేవారు ఎవ‌రైనా ఉంటారా? అన్న సందేహాన్ని రెకెత్తించేలా చేసింది టెన్నిస్ స్టార్ సెరెనా విలియ‌మ్స్‌. కోర్టులో దూకుడు ఆట‌తో ప్ర‌త్య‌ర్థిపై విరుచుకుప‌డే సెరెనా.. త‌న అభిమానుల‌కు.. క్రీడా లోకానికి స‌ర్ ప్రైజ్ చేస్తూ.. తాను ప్రెగ్నెంట్ అన్న విష‌యాన్ని వెల్ల‌డించింది. 35 ఏళ్ల సెరెనా.. మార్చిలో జ‌రిగిన ఇండియ‌న్ వెల్స్ టోర్నీలో పాల్గొన‌లేదు. ఎందుకిలా అంటే.. మోకాలి గాయ‌మ‌ని చెప్పింది.

అయితే.. అది మోకాలి గాయం కాద‌ని.. క‌డుపులో పెరుగుతున్న న‌లుసు కోస‌మ‌న్న విష‌యం తాజాగా స‌మాచారంతో అంద‌రికి అర్థ‌మైంది. రెడిట్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడైన అలెక్సిస్ ఒహానియ‌న్‌ తో కొద్దికాలంగా సెరెనా స‌హ‌జీవ‌నం చేస్తోంది. వీరిద్ద‌రికి గ‌త డిసెంబ‌రులో ఎంగేంజ్ మెంట్ కూడా జ‌రిగింది. తాజాగా.. తాను 20 వారాల గ‌ర్భ‌వ‌తినినంటూ ప్ర‌క‌టించింది.

త‌న తాజా ఫోటోను కూడా స్నాప్ చాట్‌ లో పోస్ట్ చేసింది. దీంతో.. ఆమెకు అభినంద‌న‌లు తెలుపుతూ అంత‌ర్జాతీయ మ‌హిళ‌ల టెన్నిస్ సంఘం మెసేజ్ కూడా చేసింది. మ‌రి.. త‌ర్వాతేం జ‌రిగిందోకానీ.. తాను పోస్ట్ చేసిన పోస్ట్‌ ను డిలీట్ చేసింది సెరెనా. ఏమైనా.. తన తాజా స్టేట‌స్ గురించి చెప్పి అంద‌రిని స‌ర్ ప్రైజ్ చేసింద‌న‌టంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News