టెన్నీస్ ప్రపంచంలో ఆమె ఒక చరిత్ర. తనకంటూ అద్భుతమైన పేజీలు రాసుకున్న నల్లకలువ. ఇంతకాలం తనదైన ఆటతో, షాట్ షాట్ కి తనదైన అరుపులతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తూ - విజయం అనంతరం గర్వంగా కప్పు/షీల్డ్ ని ముద్దాడే టెన్నిస్ సూపర్ స్టార్ సెరీనా విలియమ్స్ త్వరలో పెళ్లి కూతురు కానుంది. ఈ విషయాన్ని తానే స్వయంగా ప్రకటించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈమె ప్రేమకథ అనంతరం తాజాగా పెళ్లి వార్త హాట్ టాపిక్ అనే చెప్పాలి.
రెడ్డిట్ కో ఫౌండర్ అలెక్సిస్ ఒహనియన్ తో త్వరలో నిశ్చితార్ధం చేసుకుంటున్నట్లు సెరీనా స్వయంగా ప్రకటించింది. రెడ్డిట్ వెబ్ సైట్ కో ఫౌండర్ అయిన అలెక్సిస్ ఒహనియన్ తో సెరెనా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రేమ సంబంధాన్ని పెళ్లి పీటల వరకూ చేర్చడానికి ఈ జంట ముందుకొచ్చిందట. దీంతో త్వరలో వీరిరువురూ ఒకటి కానున్నారని ఆమె ప్రతినిధి ఒకరు చెబుతున్నారు.
త్వరలో పెళ్లి పీటలెక్కనున్న సెరీనా విలియమ్స్ వయసు 35 ఏళ్లు కాగా, ఆమెకు కాబోయే భర్త అలెక్సిస్ ఒహనియన్ వయసు 33 ఏళ్లు. అంటే.. తనకంటే రెండేళ్లు చిన్నవాడైన వ్యక్తిని సెరెనా వివాహం చేసుకోబోతుందన్నమాట. ఈ విషయాలపై స్పందించిన సెరెనా... రోమ్ లో తొలిసారిగా తామిద్దరమూ అనుకోకుండా కలుసుకున్నామని, అయితే ఈసారి అదే ప్లేస్ లో మళ్లీ ప్రత్యేకంగా కలుసుకున్నామని, ఈ సారి కలయికలో అలెక్స్ తెచ్చిన పెళ్లి ప్రతిపాదనకు తాను అంగీకరించానని పేర్కొంది. అయితే ఈ అంగీకారం అనంతరం స్పందించిన అలెక్స్... తన పెళ్లి ప్రతిపాదనను అంగీకరించడంతో ఈ ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతుడిగా తనను చేసిందని చెప్పాడు!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/