ఏమైంది సెరీనా? మళ్లీ ఇల్లు అమ్మేయటమా?

Update: 2021-01-24 04:09 GMT
టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. రాకెట్ పట్టుకొని టెన్నిస్ కోర్టులోకి దిగితే.. చిరుతలా విరుచుకుపడే ఆమె.. ఇటీవల కాలంలో వరుసగా ఇళ్లు అమ్మేయటం ఆశ్చర్యకరంగా మారింది. తాజాగా ఆమె తన ఇంటిని గుట్టు చప్పుడు కాకుండా అమ్మేసిన వైనం బయటకు వచ్చింది.

ఫ్లోరిడాలోని పామ్ బీచ్ గార్డెన్స్ లోని తన అధునాతన ఇంటిని ఆమె అమ్మేసిన వైనం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. ఐదు బెడ్రూంలు ఉన్న ఈ ఇంటిని గత నెలలో రూ.20.25 కోట్లకు అమ్మేసినట్లుగా తెలుస్తోంది. సుమారు 5600 చదరపు అడుగులు ఉన్న ఈ ఇంటిని ఆమె ఆరేళ్ల క్రితం అంటే 2015లో కొనుగోలు చేసినట్లు చెబుతారు. అప్పట్లో ఆమె రూ.18 కోట్లకు కొనుగోలు చేయగా.. తాజాగా అమ్మేసింది.

ఇలా ఇల్లు అమ్మటం సెరీనాకు రెండోసారి. గతంలోనూ ఆమె తన లగ్జరీ ఇంటిని అమ్మేసింది. 2019 ఏప్రిల్ లో లాస్ ఏంజిల్స్ లోని ఆరు బెడ్రూంల ఇంటిని రూ.59 కోట్లకు అమ్మేశారు. దగ్గర దగ్గర 2.76 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఇల్లు 6,101 చదరపు అడుగులుగా చెబుతారు. ఈ ఇంటిని ఆమె 2006లో  కొనుగోలు చేశారు. అప్పట్లో ఈ ఇంటిని ఆమె రూ.48 కోట్లకు కొనుగోలు చేశారని చెబుతారు. ఇలా ఒకటి తర్వాత ఒకటిగా ఇళ్లను అమ్మేయటం వెనుక విషయం ఏమిటన్నది బయటకు రావటం లేదు.
Tags:    

Similar News