గత కొన్ని రోజులుగా యావత్ ప్రపంచాన్ని వణికిపోయేలా చేస్తున్న కరోనా మహమ్మారికి విరుగుడు తయారు చేసిన సీరమ్ ఇన్ స్టిట్యూట్ కు సీఈవో అయిన అదార్ పూనావాలా తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బ్రిటన్ రాజధాని లండన్ లో ఓ మ్యాన్ షన్ ను అద్దెకు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ భవనం అద్దె ఎంతో తెలిస్తే ఎవరైనా కూడా నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఈ భవనానికి నెలకి 200వేల పౌండ్లు అద్దె. అంటే మన రూపాయల్లో సుమారు రూ.2 కోట్లు అన్నమాట. మేఫెయిర్ లోని ఈ భవనానికి ఇంత అద్దె రావడం ఈ ప్రాంతంలో రికార్డట.
ఈ భవనం 25వేల చదరపు అడుగుల్లో ఉంది. ఇంగ్లండ్ లో సాధారణంగా కనిపించే గెస్ట్ హౌసులు కూడా ఉండే ఇళ్ల లాంటివి 24 నిర్మాణాలు ఈ ప్రాంతంలో పట్టేస్తాయి. ఇంత పెద్దది కాబట్టే ఇంత భారీ రేటు పలికిందని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, మన దేశంలో SII తయారుచేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్ వాక్సిన్ లకు డీసీజీఐ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు సంస్థల నుంచి టీకాలను కేంద్రం కొనుగోలు చేస్తోంది.