ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను తరిమికొట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయి. చాలా దేశాలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. అయితే మరో రెండు మూడు వారాల్లో కరోనా వ్యాక్సిన్ తయారీని ప్రారంభించేందుకు యోచిస్తున్నట్టు భారత్ కు చెందిన సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తాజాగా సంచలన ప్రకటన చేసింది. అక్టోబర్ నాటికల్లా వ్యాక్సిన్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిపింది.
బ్రిటన్ కు చెందిన ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్ రూపకల్పనలో నిమగ్నమయ్యారు. వీరు వ్యాక్సిన్ తయారీకి ప్రపంచవ్యాప్తంగా ఏడు సంస్థలతో జట్టు కట్టారు. భారత్ నుంచి సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా ఈ ప్రయత్నాల్లో భాగస్వామిగా ఉంది.
ఈ నేపథ్యంలో తాజాగా సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాల కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక ముందుడుగు పడిందని.. మరో రెండు మూడు వారాల్లోనే భారత్ లో వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తున్నామన్నారు.
తొలి ఆరునెలల్లో రోజుకు 50 లక్షల డోసుల చొప్పున వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని .. ఆ తరువాత కోటి డోసుల వరకు ఉత్పత్తిని పెంచుతామని సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో తెలిపారు.
ఇదే సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా గతంలో మలేరియా వ్యాక్సిన్ ప్రాజెక్టు లో కూడా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తో కలిసి అభివృద్ధి చేసింది. ఇప్పుడు కరోనాపై కూడా పాలుపంచుకుంటోంది.