బాబు రాజ‌కీయం- ప‌ప్పు నిప్పు అయ్యాడు

Update: 2018-11-01 11:26 GMT
ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌ట్టే.. ఈ చంద్ర‌బాబు సిద్దాంతం కోసం ఎన్టీఆర్ పార్టీ పెట్టిన మూల కార‌ణానికే చంద్ర‌బాబు నీళ్లొదిలేశారు. సోష‌ల్ మీడియా లేనంత కాలం జ‌నాల మ‌తిమ‌రుపు త‌న బ‌లంగా మ‌లుచుకున్నాడు చంద్ర‌బాబు. కానీ... బాబు ఏం మాట్లాడినా చరిత్ర‌లో బాబు చేసిన త‌ప్పులు ఎత్తిచూపిస్తున్నారు జ‌నం. రోజుకోసారి చంద్ర‌బాబు ప‌రువు తీస్తున్నారు. ఆయ‌న నాలుక ఎన్ని ర‌కాలుగా తిరుగుతుందో చెప్ప‌డానికి కాంగ్రెస్ కూట‌మే తాజా ఉదాహ‌ర‌ణ‌.

గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు చేసిన‌ ప్ర‌చారం మీకు గుర్తుండే ఉంటుంది. అవీనితికి అడ్ర‌స్‌ లా మారిన కాంగ్రెస్‌ ను దించండి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ను స‌మాధి చేయండి. దేశం నుంచి కాంగ్రెస్‌ ను పార‌దోలండి. ఇటలీ దెయ్యం సోనియాను త‌రిమి కొట్టండి. పప్పు నాయ‌క‌త్వం మ‌న‌కు వ‌ద్దు. మొద్ద‌బ్బాయి రాహుల్‌ గాంధీ మ‌న‌ల్ని పాలిస్తాడా?

ఇవి కాంగ్రెస్ గురించి చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు. ఇపుడు అదే కాంగ్రెస్ దేశాన్ని ర‌క్షిస్తుంద‌ని కబుర్లు చెబుతున్నాడు చంద్ర‌బాబు. అయినా ఎప్ప‌టికెయ్య‌ది ప్ర‌స్తుత‌మో అప్ప‌టికా మాట‌లాడి.. అన్న చందాన ఆనాడు మోడీ హ‌వా న‌డిచిన‌పుడు మోడీతో క‌లిసి రాజకీయ ఎత్తుగడ కోసమే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ రెండుగా చీల్చిందని - విభజనతో రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్ అని దానిని పాత‌యేండని చెప్పి ఇపుడు అదే కాంగ్రెస్‌ ను గెలిపించ‌మ‌ని చంద్ర‌బాబు ప్ర‌మోట్ చేస్తున్నాడు. ఇపుడు రాజ‌కీయంగా కేంద్రంతో క‌య్యాలు పెట్టుకుని రాష్ట్రాన్ని వెన‌క్కు తీసుకెళ్తున్న బాబు రాజ‌కీయంగా తాను నిల‌బ‌డ‌టానికి ఎపుడూ ఏదో ఒక పార్టీ అండ చూసుకుంటూ ఉంటారు. దానికోసం ఏ సిద్ధాంతం వ‌దిలెయ్య‌డానికి అయినా ఆయ‌న వెనుకాడ‌రు. చివ‌ర‌కు కాంగ్రెస్‌ కు వ్య‌తిరేకంగా పుట్టిన త‌న పార్టీని కాంగ్రెస్ తొత్తుగా మార్చేశారు నారా బాబు. ఎపుడో ఏదో ఒక పార్టీతో పొత్తు లేక‌పోతే గెలిచే ప‌రిస్థితి లేదు.

త‌న‌కంటూ ఓ స్టాండు ఉండ‌దు. మొద‌ట మోడీ చెప్పాడ‌ని ప్రత్యేక హోదా అవసరం లేదన్నాడు. జ‌గ‌న్ ఆ నినాదం ఇస్తే అరెస్టులు చేయ‌మ‌ని ఆదేశించాడు. తీరా ఇపుడు త‌న‌కు అవ‌స‌రం కాబ‌ట్టి మ‌ళ్లీ జై ప్ర‌త్యేక హోదా అంటున్నాడు. ఎన్నిక‌ల లోపు బాబు త‌న‌లో ఇంకా ఎన్నివిశ్వ‌రూపాలు చూపిస్తారో !!

   

Tags:    

Similar News