తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న విధానాల్ని తప్పు పట్టేందుకు తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ మీటింగ్ ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఉన్న గుప్పెడు మంది నేతలు.. ఎవరి దారి వారిదన్నట్లుగా వ్యవహరించిన తీరు ఏ మాత్రం సరికాదన్న మాట వినిపిస్తోంది. తాజాగా నిర్వహించిన సమావేశం గురించి నాలుగైదు రోజుల ముందే నేతలకు సమాచారం ఇచ్చినా.. హాజరు సంఖ్య ఆందోళనకరంగా ఉందంటున్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కేవలం ఆరుగురు మాత్రమే. వీరికి ముగ్గురు ఎంపీలు ఉన్నారు.ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. అంటే.. ప్రజాప్రతినిధులు పది మందే. ఇలాంటివేళ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా తీర్మానం చేయాల్సి వచ్చినప్పుడు అందరూ హాజరై.. ఒకే గొంతును వినిపిస్తే.. అంతో ఇంతో ప్రయోజనం ఉంటుంది. అందునా.. కేసీఆర్ లాంటి బలమైన.. ప్రజాకర్షక అధినేతను ఎదుర్కోవటానికి మామూలు బలం ఏ మూలకు సరిపోదు.
ఐకమత్యంతో అడుగు వేయాల్సిన కాంగ్రెస్ నేతలు.. అందుకు భిన్నంగా ఎవరి దారి వారిదన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు కాంగ్రెస్ పార్టీని మరింత బలహీనంగా మారుస్తుందంటున్నారు. కేసీఆర్ విధనాల్ని తప్పు పట్టేందుకు నిర్వహించిన తాజా సమావేశానికి పది మంది ప్రజాప్రతినిధుల్లో కేవలం ముగ్గురు మాత్రమే హాజరు కావటం.. ఏడుగురు డుమ్మా కొట్టటం హాట్ టాపిక్ గా మారింది.
ఎంపీలు రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి.. ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు.. రాజగోపాల్ రెడ్డి.. పొదెం వీరయ్య.. సీతక్కలు మీటింగ్ కు రాలేదు. ఉన్న పది మందిలో ఏడుగురు నేతలు సమావేశానికి హాజరు కాలేదన్న మీడియా ప్రశ్నకు కాంగ్రెస్ నేతలు కస్సుమన్నారు. శ్రీధర్ బాబు కొడుక్కి వడుగు ఉందని.. దాన్ని ఆపేసుకొని సమావేశానికి రావాలా? అని జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు బాగానే ఉన్నా.. ఉన్న పది మంది ఒక చోటకు చేరేందుకు వీలుగా సమావేశ తేదీని అడ్జెస్ట్ చేసుకోలేకపోయారా? అన్న ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం రావట్లేదని చెప్పక తప్పదు.