పుల్వామా ఉగ్రదాడికి ప్రతిగా పాక్ లోని బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ జరిపిన మెరుపుదాడుల సంగతి తెలిసిందే. అత్యంత రహస్యంగా జరిపిన ఈ ఆపరేషన్ కు సంబంధించి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఈ సీక్రెట్ ఆపరేషన్ ను అత్యంత రహస్యంగా ఉంచారు. కేవలం ఏడగురికి మాత్రమే దీనికి సంబంధించిన సమాచారం తెలుసన్న విషయం తాజాగా బయటకు వచ్చింది.
పాక్ లోని బాలాకోట్ ఉగ్రస్థావరం మీదనే దాడికి ఫిక్స్ కావటానికి వెనుక చాలానే కసరత్తు జరిగిందట. వేరే చోట అనుకున్నా.. అక్కడ జనసమ్మర్థం ఎక్కువగా ఉండటం.. వాటి మధ్యలో జేషే ఏ మహ్మద్ స్థావరం ఉండటం.. దానిపై బాంబుల దాడి చేస్తే.. ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో టార్గెట్ మార్చారు.
మొదట అనుకున్న దానికి భిన్నంగా బాలాకోట్ ఉగ్రస్థావరాన్ని టార్గెట్ చేయాలని నిర్ణయించారు. దీనికి కారణం..ఈ స్థావరం చుట్టుపక్కల జనావాసాలు లేకపోవటం.. దీనిపై మెరుపుదాడి చేస్తే జేషే ఎ మహ్మద్ ను సూటిగా వార్నింగ్ ఇచ్చినట్లు అవుతుందని నిర్ణయించారు. పుల్వమాలో జరిగిన నస్టానికి బదులు తీర్చుకుంటుందని అంచనా వేశారు. పాక్ ప్రజలకు నష్టం వాటిల్లకుండా.. తమ లక్ష్యమైన జేషే ఎ మహ్మద్ కు మాత్రమే దెబ్బ తీయాలన్న ఆలోచనను ఇంటెలిజెన్స్ కు తెలిపారు.
ఈ రహస్య ఆపరేషన్ కు సంబంధించిన వివరాలు కేవలం ఏడుగురికి మాత్రమే పరిమితమయ్యాయి. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రధాని జాతీయ భద్రత సలహాదారు అజిత్ కుమార్ దోవల్.. త్రివిధ దళాల అధిపతులు.. పరిశోధన.. విశ్లేషన విభాగం రాకు చెందిన వారు.. ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతులకు మాత్రమే ఈ దాడులకు సంబంధించిన వివరాలు రివీల్ చేసినట్లుగా చెబుతున్నారు.