చేతిలో చిల్లిగవ్వ లేనప్పుడు.. పైసా లేనోడు అంటే తప్పేముంది? జేబులో నోట్ల కట్టలు ఉన్న వేళలో.. పైసా లేదు ఎదవకు అంటూ నోరు పారేసుకున్నారనుకోండి.. అప్పుడు జరిగేదేంటి? ఉన్నది ఉన్నట్లుగా చెప్పినప్పుడు ఏమవుతుందో.. ఉన్నది లేనట్లుగా చెప్పినా అదే అవుతుంది. చాలా సింఫుల్ లాజిక్. ఇది వ్యక్తిగత జీవితాల్లోనే కాదు.. రాజకీయాలకు ఇదే సూత్రం వర్తిస్తుంది. బాగా పని చేసే ప్రభుత్వాన్ని అదే పనిగా తిట్టి పోస్తున్నారనుకోండి.. ఆ మాత్రం దానికే ఆ ప్రభుత్వ పరపతి పోతుందా ఏంటి? రాజకీయ ప్రత్యర్థులు నోటికి వచ్చినట్లు మాట్లాడినా.. విచక్షణతో వ్యవహరించే ప్రజలు విషయాన్ని అర్థం చేసుకోకుండా ఉండరు కదా?
అవసరం లేకున్నా అదే పనిగా విమర్శలు చేస్తుంటే.. వారి విషయంలో ప్రజలేం చేయాలో అదే చేస్తారు. గతంలో మాదిరి పరిమిత సంఖ్యలో ప్రచార సాధనాలు ఉంటే కంగారు పడాలి. కానీ.. ఇప్పుడు నడుస్తున్నది డిజిటల్ కాలం. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా.. దాన్ని కళ్లకు కళ్లినట్లుగా చూపించే సాంకేతికత సామాన్యుడి చేతికి వచ్చేసింది. డ్రాయింగ్ రూంలో కూర్చొని.. వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్థాన్ లోని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం బలపరీక్షలో ఓడిన క్షణాల్ని లైవ్ లో చూస్తున్న పరిస్థితి.
అంతేనా.. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా.. లైవ్ లో చూసే అవకాశాన్ని ఇవాల్టి రోజున సోషల్ మీడియా ఇచ్చేసింది. అలాంటి వేళలో నిజాన్ని మాత్రమే కాదు అబద్ధాన్ని కూడా దాయలేని పరిస్థితి. ఒకవేళ దాచే ప్రయత్నం చేసినా.. సూర్యుడ్ని అరచేతిలో ఆపుతానన్నట్లుగా ఉంటుంది. ఈ విషయాన్ని ఎవరు తెలుసుకున్నా.. తెలుసుకోకున్నా.. ఏపీ అధికారపక్ష నేతలు వీలైనంత త్వరగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఏపీలోని జగన్ ప్రభుత్వాన్ని అదే పనిగా బద్నాం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారంటూ కొన్ని మీడియా సంస్థలతో పాటు.. సోషల్ మీడియా ఖాతాల్ని.. రాజకీయ పార్టీలను పెద్ద ఎత్తున తిట్టి పోసే వారంతా.. ఒక వాస్తవాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఏపీలో కరెంటు కోతలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇలాంటి సందర్భంలో ఏపీలో అసలు కరెంటు కోతలే లేవు.. 24 గంటలు కరెంటు సప్లై అవుతుందని చెప్పే ప్రయత్నం చేస్తే ఎంత నవ్వులాటగా ఉంటుంది? అదే సమయంలో.. ఏపీలో లేని విషయాన్ని ఉందన్న భావన కలిగించేలా ఎవరైనా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే.. ఆ ప్రయత్నం వారి మీద ఉన్న నమ్మకాన్ని పోయేలా చేయటమే కాదు.. ఇలాంటి దరిద్రపుగొట్టు ఆలోచనలు ఎలా చేస్తారంటూ మండిపడే పరిస్థితి ఉంటుంది.
ఇటీవల కాలంలో ఏపీ ప్రతిష్టను దెబ్బ తీయటానికి అక్కడి విపక్షం ఏదోలా ప్రయత్నిస్తుందంటూ కొందరు అదే పనిగా వాపోతుంటారు. ఉదాహరణకు ఏపీలో కరెంటు కోతలు కానీ.. అవసరానికి మించిన సంక్షేమ ఫలాలు కానీ.. స్థాయికి మించిన అప్పులు కానీ.. ఇలా ఏం చేసినా.. వాటిల్లో నిజం ఎంత? అబద్ధం ఎంత? అన్న విషయం అందరికి అవగాహన ఉంది. లేనిది ఉన్నట్లుగా ప్రచారం చేస్తే.. నమ్మేయటానికి ఇదేమీ గోబల్స్ టైం కాదు. రాజకీయవేదికలు తరచూ గోబెల్స్ ప్రచారం అంటారు కానీ.. ఆయన ఉన్నప్పటి పరిస్థితికి ఇప్పటికి చాలానే తేడా ఉందన్నది మర్చిపోకూడదు.
ఎవరైనా తప్పుడు ప్రచారం మొదలు పెడితే.. అలాంటి వాటికి కౌంటర్లు ఇవ్వటానికి కొమ్ములు తిరిగిన రాజకీయ నేతలు అవసరం లేదు. సామాన్యుడు సరిపోతాడు. సోషల్ మీడియా ఉన్నంత కాలం ఇలాంటి పరిస్థితే ఉంది. అందుకే.. డ్రగ్స్.. శ్రీలంక అంటూ ఏపీ ప్రతిష్టను ఏదోలా దిగజార్చటానికి ప్రయత్నిస్తున్నారంటూ విపక్షం మీద విరుచుకుపడేవారు.. వారి మీద కంటే కూడా.. పాలన మీదా.. కరెంటు కోతలు లేనిరీతిలో ఏపీలో పరిస్థితులు ఉండేలా చేస్తే.. ఎవరు మాత్రం తప్పుడు ప్రచారాల్ని నమ్ముతారు. ఈ విషయం ఏపీ అధికారపక్ష నేతలకు.. వారిని అమితంగా ఆరాధించే వారికి ఎప్పటికి తెలుస్తుందో?