నేరగాళ్లు తెలివి మీరి పోతున్నారు. సినీ ఫక్కీలో అమ్మాయిల ను ఎరగావేసి బ్లాక్ మెయిలింగ్ కు దిగుతున్నారు. అలా చాలా మందికి అమ్మాయిల ను ఆశ చూపి వీడియోలు తీసి లక్షలు వసూలు చేశారు. కానీ ఒక వ్యక్తి తనకు జరిగిన మోసం పై పోలీసులకు ఫిర్యాదు చేయడం తో ఈ మోసం వెలుగు చూసింది.
తూర్పు గోదావరి జిల్లా సామర్ల కోట పరిధి లో ఈ సినీ ఫక్కీలో సెక్స్ బ్లాక్ మెయిలింగ్ ఉదంతం చోటు చేసుకుంది. జి.మామిడాడ లో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న తాడి కేదార మణికంఠ రెడ్డి కి, కాకినాడ లో జై ఆంధ్రా ఛానెల్ నడుపుతున్న తేతలి దుర్గారెడ్డి కి మధ్య స్థల వివాదం ఎప్పటినుంచో ఉంది. దీంతో దుర్గారెడ్డి తనకు న్యూస్ చానెల్ ఉందని.. దాని ద్వారా బ్లాక్ మెయిల్ చేద్దామని మాస్టర్ ప్లాన్ వేశాడు. తన స్థలాన్ని దక్కించుకునేందుకు కేదారమణికంఠరెడ్డిని సెక్స్ బ్లాక్ మెయిలింగ్ చేయడానికి రెడీ అయ్యారు..
తన చానెల్ లో పనిచేసే రాకేష్ ను దుర్గారెడ్డి సంప్రదించాడు. దీంతో రాకేష్ ఒప్పుకొని తనకు తెలిసిన భార్యభర్తలు మహేష్-అశ్వినిల సాయం కోరాడు. ఈ మేరకు ఈ నలుగురు కలిసి కేదారమణికంఠరెడ్డిని ముగ్గులోకి దించారు. అశ్వినితో మాయమాటలు చెప్పించి ఓ చోటుకు రమ్మని గదిలో రాసలీలలు మొదలుపెట్టించాడు. దాన్ని రహస్యంగా వీడియోలు తీశారు. ఆ తరువాత ఆ సెక్స్ బ్లాక్ మెయిలింగ్ తో రూ.25 లక్షలు ఇవ్వాలని లేదంటే టీవీచానెల్స్ లో వేస్తామని బెదిరించాడు. కుర్చీ కట్టి చిత్రహింసలు పెట్టారు. కానీ తన వద్ద అంత లేదని.. రూ.50వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే అవీ ఇవ్వక పోవడంతో ఈ కేదర మణికంఠ రెడ్డి వద్ద ఉన్న 63వేల నగదు, బంగారు ఆభరణాలు, తెల్ల కాగితాల పై ల్యాండ్ పత్రాల కు చెందిన సంతకాలు, వేలి ముద్రలు తీసుకొని పరారయ్యారు.
అయితే తనను మోసం చేసి చోరీ చేసిన వైనం పై కేదార మణికంఠారెడ్డి పోలీసుల ను ఆశ్రయించారు. పోలీసులు చాక చక్యంగా అశ్విని-మహేష్ దంపతుల ను ఈనెల 14న అదుపు లోకి తీసుకున్నారు. అసలు సూత్రధారులైన చానెల్ యజమాని దుర్గారెడ్డి, రాకేష్ లు పరారీలో ఉన్నారు. అశ్విని-మహేష్ లను విచారించాగా.. ఇలా చాలా మందిని సెక్స్ బ్లాక్ మెయిల్ చేశామని వారు డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకొని పేరు బయటకు రాకుండా వెళ్లి పోయారని తెలిపారు. వీరి సెక్స్ బ్లాక్ మెయిలింగ్ దందాకు ఇలా పోలీసులు ఎండ్ కార్డు వేశారు.