అత్యున్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఆచితూచి వ్యవహరిస్తుంటారు. వారి నోటి నుంచి వచ్చే ప్రతి మాటపైనా చర్చ జరిగే అవకాశం ఉండటంతో.. తొందరపడి మాట అనేందుకు ఏ మాత్రం ఇష్టపడరు. ఇక.. సభలు.. సమావేశాలు లాంటి వాటిల్లో అయితే.. నోరు విప్పేందుకు ఒక పట్టాన ఇష్టపడరు. ఒకవేళ.. నోరువిప్పినా.. ముందస్తు కసరత్తు జరిగి..జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు.
రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్.. ఒక ముఖ్యమంత్రి బ్రహ్మాండంగా పని చేస్తున్నారని.. డైనమిక్ ముఖ్యమంత్రి అంటూ పొగిడేయటం చాలా చాలా అరుదు. ఒకపక్క ప్రభుత్వ వైఖరిపై విపక్షాలు విరుచుకుపడుతూ.. ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమపథకాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వేళ.. ముఖ్యమంత్రిని పొగిడేస్తూ గవర్నర్ నరసింహన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఒకే సోఫాలో గవర్నర్.. ముఖ్యమంత్రులు కాస్త దూరంగా అయినా కూర్చోవటం చాలా తక్కువనే చెప్పాలి. ఇరువురి మధ్య దూరం కాస్త ఎక్కువగా ఉంటుంది. అలాంటిది అందుకు భిన్నంగా.. కొత్త సంవత్సరం వేళ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని డైనమిక్ సీఎం అంటూ పొగిడేసిన గవర్నర్ నరసింహన్ పై విమర్శలు షురూ అయ్యాయి.
గవర్నర్ తన హోదాను మరిచిపోయి మరీ మాట్లాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. రుణమాఫీ.. దళితులకు 3 ఎకరాల భూమి.. మైనార్టీలకు రిజర్వేషన్లు ఇవ్వనందుకా కేసీఆర్ డైనమిక్ సీఎం అని గవర్నర్ ను సూటిగా ప్రశ్నించారు.
ఉమ్మడి రాష్ట్రం కంటే ఎక్కువ అప్పులు చేసినందుకు కేసీఆర్ డైనమిక్ సీఎమ్మా?అని ప్రశ్నించిన షబ్బీర్.. ‘‘కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క మెగావాట్ విద్యుత్ అయినా ఉత్పత్తి చేశారా? ఫిరాయింపుల్నికట్టడి చేయాల్సిన గవర్నర్.. వాటిని ప్రోత్సహించేలా వ్యవహరించటం.. ఫిరాయింపుల చట్టాన్ని గౌరవించని గవర్నర్ దేశంలో నరసింహన్ ఒక్కరే’’ అని ఆయన ఫైర్ అయ్యారు.
తన పదవిని కాపాడుకునేందుకే నరసింహన్ పొగడ్తల కార్యక్రమాన్ని మొదలు పెట్టినట్లుగా అభివర్ణించిన షబ్బీర్.. ముఖ్యమంత్రి భజనలు చేయటం మానాలన్నారు. సీఎంను భజన చేసే ఇలాంటి గవర్నర్ కు వినతి పత్రాలు ఇవ్వటం వేస్ట్ అన్న ఆయన.. ఈ విషయం మీద పార్టీలో మాట్లాడుకుంటామని.. త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పటం గమనార్హం. షబ్బీర్ అలీతో మొదలైన ఈ విమర్శల పర్వం.. రానున్న రోజుల్లో మరెంత ఎక్కువ అవుతుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/