క్రిప్టో కరెన్సీపై తస్మాత్ జాగ్రత్త: శక్తికాంతదాస్‌

Update: 2021-11-13 02:30 GMT
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంతదాస్ క్రిప్టో కరెన్సీ పైన ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థలకు ఇది ముప్పని అభిప్రాయం వ్యక్తం చేశారు. క్రిప్టో కరెన్సీలకు నియంత్రిత వ్యవస్థ ఏర్పాటు చేసేవరకు ఇవి దేశ ఆర్థిక స్థిరత్వానికి సవాల్ చేస్తోందని చెప్పారు. దేశంలో రోజు రోజుకు క్రిప్టో కరెన్సీపై కొన్ని వర్గాల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే చాలా మంది క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు సైతం పెట్టారు. దేశ స్థూల ఆర్థిక వ్యవస్థకు, ఆర్థికస్థిరత్వానికి క్రిప్టో కరెన్సీ ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్యను ఎక్కువగా చేసి చెబుతున్నారన్నారు. ప్రస్తుతం క్రిప్టో క్రేజ్ రోజు రోజుకు పెరుగుతుంది. ఫలితంగా ట్రేడింగ్‌ చేసే వారి సంఖ్య కూడా పెరుగుతున్న సమయంలో గవర్నర్‌ శక్తి కాంత దాస్‌ ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇది క్రిప్టో మార్కెట్‌ పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో వేచి చూడాలి. మరోవైపు దేశంలో క్రిప్టో కరెన్సీ ట్రేడ్‌ చేస్తున్న వారి సంఖ్య దేశంలో పది కోట్లు దాటింది.

గతంలో క్రిప్టో కరెన్సీని ఆర్బీఐ నిషేధించింది. సుప్రీం కోర్టు ఆ నిషేధాన్ని తొలగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో ట్రేడింగ్‌ పెరిగింది. 2021, ఫిబ్రవరి 5న సెంట్రల్‌ బ్యాంకు డిజిటల్‌ కరెన్సీ విధానంపై ఓ అంతర్గత కమిటీ వేసింది. ప్రస్తుతాని కైతే క్రిప్టో కరెన్సీపై ప్రభుత్వం ఎలాంటి చట్టాలు చేయలేదు. నిపై స్టాక్‌ హోల్డర్లు, అధికారులు, మంత్రిత్వ శాఖల మధ్య నిరంతరం చర్చలు జరుగుతు న్నాయని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన సెస్ తగ్గించడంపై శక్తికాంత దాస్ మాట్లాడుతూ ఇది పాజిటివ్ డెవలప్‌ మెంట్ అని, ఆర్బీఐ ద్రవ్యోల్భణం టార్గెట్ 5.3 శాతానికి చేరుకోవడానికి ఇది దోహదపడుతుందని తెలిపారు. అలాగే, వృద్ధి రేటు 9.5 శాతంగా అంచనా వేస్తున్నామని, దీనిని అందుకోవడానికి ఉపకరిస్తుందన్నారు.

ఇప్పటికే మనీ మార్కెట్‌లో లిక్విడిటీ రీబ్యాలెన్స్ చోటు చేసుకుందన్నారు. ఎనర్జీ, స్టీల్, కమోడిటీస్ ధరలు పెరిగాయని, కానీ ప్రస్తుతం అవి పీక్ స్థాయిలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారన్నారు. భారత జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.5 శాతంగా ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఆర్థిక రికవరీ వేగవంతమైందని చెప్పారు


Tags:    

Similar News