ఏపీ జనాల సంతృప్తి - బాబు అసంతృప్తి.. విషయం ఇదీ..!
కాబట్టి కొందరు సర్కారు ఇంకా పథకాలు అమలు చేయడం లేదని చెప్పి ఉంటారు.
ఇటీవల కాలంలో రెండు మాసాలుగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. తమ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారో ఆయన ఐవీఆర్ ఎస్ సర్వే రూపంలో అభిప్రాయాలు సేక రించారు. సహజంగానే ప్రజలు ప్రభుత్వం నుంచి పథకాల అమలును కోరుకుంటారు. కాబట్టి కొందరు సర్కారు ఇంకా పథకాలు అమలు చేయడం లేదని చెప్పి ఉంటారు. ఈ విషయమే చంద్రబాబులో గాభరాను పెంచేసింది. కానీ, ఇదేసమయంలో పలు అంశాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు.
కానీ, ఈ సంతృప్తి మాటను పక్కన పెట్టిన చంద్రబాబు.. అసంతృప్తిపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలు స్తోంది. ఇది సరికాదన్నది పరిశీలకుల వాదన. జనాలు ఇప్పుడు సంతృప్తిగానే ఉన్నారని వారు చెబుతు న్నారు. కూటమి సర్కారు పగ్గాలు చేపట్టిన తర్వాత.. కీలకమైన ఐదు విషయాల్లో ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నదివాస్తవం. ఆయా విషయాలను పరిగణనలోకి తీసుకుంటే.. గడిచిన ఏడు మాసాల్లో కూటమి సర్కారుకు మంచి మార్కులు పడినట్టేనని అంటున్నారు.
ఇవీ.. 5 విషయాలు
1) పింఛన్ల పంపిణీ: కూటమి సర్కారు రాకతో.. రూ.1000 చొప్పున పెంచి సామాజిక భద్రతా పింఛన్లను అందిస్తున్నారు. అది కూడా ఠంచనుగా 1వ తారీకు, ఒకవేళ 1వ తారీకు సెలవు అయితే.. దీనికి ముందు రోజే లబ్ధిదారులకు అందిస్తున్నారు. దీనిపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు.
2) ఉచిత గ్యాస్: తాము అధికారంలోకి వస్తే.. మహిళలకు ఉచితగ్యాస్ ఇస్తామన్న హామీని కూటమి సర్కారు నెరవేరుస్తోంది. దీనిపైనా మహిళలు సంతృప్తిగానే ఉన్నారు. ఎక్కడా లోపాలు లేకుండా.. దీనిని అమలు చేస్తున్నారు.
3) రహదారుల బాగుచేత: వైసీపీ హయాంలో కనీసం పట్టించుకోని రహదారులను కూడా.. కూటమి సర్కా రు అద్దంగా తయారు చేస్తోంది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణ పనులు వేగంగా సాగుతు న్నాయి. దీంతో ప్రజలు సంతృప్తిగానే ఉన్నారు.
4) స్పందన: ప్రజల సమస్యలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పందిస్తోంది. కూటమిలోని మూడు పార్టీలు కూడా ప్రజాదర్బార్లు నిర్వహిస్తూ.. ప్రతి రోజూ ప్రజల సమస్యలు వింటున్నాయి. కొన్నింటిని అప్పటికప్పుడే పరిష్కరిస్తున్నారు. ఇది కూడా .. ప్రజల్లో సంతృప్తి పెంచింది.
5) ఉచిత ఇసుక: గతంలో లారీ ఇసుకను 20 వేల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నుంచి రూ.7 వేలకు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇదిభవన నిర్మాణ రంగాన్ని పరుగులు పెట్టించింది. సో.. ఇన్ని సంతృప్తులు ఉండగా.. చంద్రబాబు అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు పరిశీలకులు.