ట్రంప్ కు 'అణుబాంబు లాంటి' ఆహ్వానం.. ఏం చేస్తారో?

మూడేళ్ల కిందట ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలైన సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణు బాంబు హెచ్చరికలు చేయడంతో ప్రపంచం గజగజలాడింది.

Update: 2025-01-29 15:30 GMT

ఆ ఒక్క అణు బాంబు దాడి ఒక దేశ ప్రయాణాన్నే మార్చేసింది.. ఆ ఒక్క అణుబాంబు దాడి రెండో ప్రపంచ యుద్ధాన్ని ముగించింది.. ప్రపంచంలో అదే తొలి అణు దాడి.. చివరిది కూడా.. కానీ, దానిని తలచుకుంటే ఇప్పటికీ వణికిపోతారు.. 80 ఏళ్లయినా ఆ విధ్వంసం తాలూకూ విషాదం ఇంకా వెంటాడుతూనే ఉంది. మూడేళ్ల కిందట ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలైన సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణు బాంబు హెచ్చరికలు చేయడంతో ప్రపంచం గజగజలాడింది.

చరిత్రలో అత్యంత భయంకరమైనదిగా నిలిచింది రెండో ప్రపంచ యుద్ధం. ఈ యుద్ధంలో అమెరికా పెరల్ హార్బర్ పై జపాన్ దాడి చేసింది. దీనికి ప్రతిగా అమెరికా.. జపాన్ లోని హిరోషిమా, నాగసాకి పట్టణాలపై ఏకంగా అణు దాడికి దిగింది. ఇది 1945లో జరిగింది. అంటే 80 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ను జపాన్‌ ఆహ్వానించింది. ఈ మేరకు హిరోషిమా, నాగసాకి నగరాల మేయర్లు ట్రంప్ నకు ఉమ్మడి లేఖను రాశారు.

ట్రంప్ ను పిలిచింది ఎందుకంటే..?

1945 ఆగస్టు 6, 9 తేదీల్లో హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణు బాంబులేసింది. దీంతో ఆ రెండు నగరాలు నామరూపాల్లేకుండా పోయాయి. ఈ తీవ్ర దాడితో జపాన కంపించింది. కొద్ది రోజులకే

రెండో ప్రపంచ యుద్ధంలో లొంగిపోయింది. ఇక నాడు హిరోషిమాలో 1.40 లక్షల మంది, నాగసాకిలో 74 వేలమంది చనిపోయారు. గాయాలై ప్రాణాలతో మిగిలినవారూ తర్వాత రేడియేషన్‌ ప్రభావంతో చనిపోయారు. అయితే, పెరల్ హార్బర్ పై దాడికి ప్రతిదాడిగానే అమెరికా వీటిని చూసింది తప్ప.. జపాన్ కు ఏనాడూ క్షమాపణలు చెప్పలేదు. అయితే, 65 ఏళ్ల తర్వాత అంటే 2010లో అమెరికా అప్పటి రాయబారి జాన్‌ రూస్‌ హిరోషిమాలో అణుబాండి దాడి బాధితుల సంస్మరణ కార్యక్రమానికి హాజరయ్యారు. 2016లో నాటి అధ్యక్షుడు ఒబామా హిరోషిమాను సందర్శించి.. ఈ నగరంలో పర్యటించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా నిలిచారు. అయితే, విఫల అధ్యక్షుడిగా ముద్రపడినా.. 2023లో హిరోషిమాలో బైడెన్‌ పర్యటించారు. ట్రంప్‌ మాత్రం తన తొలి విడత పాలనలో వెళ్లలేదు.

అందుకని ఆయనను ఆహ్వానించారు. ‘‘ట్రంప్‌ స్వయంగా అణు బాంబు బాధితుల అనుభవాలను తెలుసుకోవాలి. శాంతి కోసం వారు పడుతున్న ఆరాటాన్ని అర్థం చేసుకోవాలి. అణ్వాయుధాలు రేపే అమానవీయతపై అవగాహన పెంచుకోవాలి. అణ్వాయుధాల నిషేధం దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాం’’ అని హిరోషిమా, నాగసాకి గవర్నర్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News