క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో చ‌రిత్ర తిర‌గ‌రాసిన 92 ఏళ్ల తాత‌గారు!

Update: 2023-05-14 05:00 GMT
ఆయ‌న ఇద్ద‌రు ప‌ట్టుకుంటే త‌ప్ప న‌డ‌వ‌లేని స్థితిలో ఉన్నారు. అయితేనేం.. ప్ర‌జ‌లు ఆయ‌న‌ను కోరుకున్నా రు. తాజా ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ను గెలిపించారు.  అంతేకాదు.. ఆయ‌న ప్ర‌చారం చేయ‌క‌పోయినా.. ఆయ‌న‌కు ప్ర‌జ‌లు పోటెత్తి మ‌రీ ఓటేశారు. ఆయ‌నే శామ‌నూరు శివ‌శంక‌ర‌ప్ప‌. వ‌య‌సు 92 సంవ‌త్స‌రాలు. ముద్దుగా అంద‌రూ.. తాత‌.. అనే పిలుచుకుంటారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన శివశంకరప్ప.. దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. శామనూరు శివశంకరప్ప.. దావణగెరె దక్షిణ నియోజకవర్గంలో ఓటమి ఎరుగని నాయకుడు. ఇప్పుడు ఆయనకు 92 ఏళ్లు రావ‌డంతో క‌ద‌ల‌లేని ప‌రిస్థితిలో ఉన్నారు. ఈ వయసులో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.  

దావణగెరె దక్షిణ నియోజకవర్గం శామనూరు శివశంకరప్ప వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2008లో దావణగెరె నియోజకవర్గాన్ని దావణగెరె దక్షిణగా విడదీశారు.

మొత్తంగా దావణగెరె నగరం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం విశేషం. ఇలా వరుస విజయాలతో దావణగెరె దక్షిణ ప్రజలపై మరోసారి విశ్వాసం వ్యక్తం చేశారు.

నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు నాపై ఉన్నాయి. నా వయసు 90 ఏళ్లు దాటినప్పటికీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను.

ఈ సారి కూడా మళ్లీ నేనే గెలిచి చరిత్ర సృష్టిస్తా అని శంక‌ర‌ప్ప చెప్పిన మాట‌ల‌ను ప్ర‌జ‌లు తాజా ఫ‌లితంతో నిజం చేయ‌డం విశేషం.  తాజా ఎన్నిక‌ల్లో ఆయ‌న 84, 298 ఓట్ల‌తో విజ‌యం ద‌క్కించుకున్నారు.

Similar News