మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. దేశంలో పెరిగిందని చెబుతున్న అసహనంపై చర్చ సందర్భంగా లోక్ సభలోఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ కు చెందిన తన మిత్రుడు ఒకరు.. భారతదేశంపై చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. దేశంలో అసహనం పెరుగుతోందని.. చూస్తుంటే.. దేశంలో నివసిస్తున్న ముస్లింల కంటే.. ఆవుకే ఎక్కువ రక్షణ ఉన్నట్లుగా అనిపిస్తుందని.. అలాంటి ప్రచారం భారీగా సాగుతుందని వ్యాఖ్యానించారు.
తన బంగ్లాదేశ్ మిత్రుడు చెప్పినట్లుగా దేశంలోని అసహన పరిస్థితులపై విదేశాల్లో భారీగా ప్రచారం సాగుతుందని.. దీని కారణంగా దేశ పరపతి విపరీతంగా పడిపోతుందని.. మేకిన్ ఇండియా అంటూ ప్రధాని మోడీ ఒక పక్క ప్రచారం చేస్తున్నా.. అసహనం లాంటి అంశాల కారణంగా నష్టం భారీగా సాగుతుందన్న ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలోని అసహన పరిస్థితులపై తన బంగ్లాదేశ్ మిత్రుడు చెప్పినదాన్లో వాస్తవం ఎంత ఉందో ఆలోచించాలన్న శశిథరూర్ వ్యాఖ్యలు చూస్తుంటే.. దేశం మీద ఇష్టారాజ్యంగా స్నేహితుడు మాట్లాడితే.. శశిథరూర్ ఏం సమాధానం చెప్పారో కూడా చెబితే బాగుండేది. తన బంగ్లాదేశ్ మిత్రుడి గురించి చెప్పి వదిలేసిన శశి.. ఆ వ్యాఖ్యల మీద తాను ఎలా రియాక్ట్ అయ్యిందో కూడా చెబితే సబబుగా ఉండేది. భారత్ లో జరుగుతున్న పరిణామాలపై ఇన్ని వ్యాఖ్యలు చేస్తున్న బంగ్లాదేశ్ మిత్రుడు.. తన దేశంలోనూ.. తన పక్కనే ఉన్న పాక్ లోనూ.. ఆసియాలోని మిగిలిన దేశాల్లో వాస్తవంగా జరుగుతున్న అంశాలపై ఆవేదన వ్యక్తం చేశారా? లేదా. ఏది ఏమైనా తాము చేస్తున్న విష ప్రచారం విస్తృతి ఎంత తీవ్రంగా ఉందన్న విషయాన్ని శశిథరూర్ తన తాజా వ్యాఖ్యలతో చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.