ఫ్లైట్ లో డెలివరీ అయిన ఆమె.. అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది

Update: 2021-08-27 08:30 GMT
తాలిబన్ల దెబ్బకు ఆ దేశం నుంచి విదేశాలకు వెళుతున్న ఎంతోమందిలో ఆమె కూడా ఒకరు. కాకుంటే నిండు చూలాలు.  ఆఫ్గాన్ నుంచి ఎంత త్వరగా బయపడితే అంత మంచిదన్న ఉద్దేశంతో విమానం ఎక్కేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించటం.. ఫ్లైట్ జర్నీ షురూఅయిన కాసేపటికే లో ప్రెషర్ తో ఆమె తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కొనటం.. సమయానికి అనుగుణంగా స్పందించిన పైలెట్.. విమానాన్ని కాస్త కిందకు దించి ప్రయాణం చేయించిన వైనం తెలిసిందే.

ఈ క్రమంలో ఆ మహిళకు విమానంలోనే డెలివరీ అయ్యింది. పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన ఆమె ఉదంతం పెద్ద ఎత్తున మీడియాలో కవర్ అయ్యింది. ఆమె తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చారు. దీనికి కారణం ఆమె తీసుకున్ నిర్ణయమే. తనను.. తన బిడ్డ ప్రాణాల్ని కాపాడిన విమానం పేరును తన కుమార్తె పేరుగా పెట్టింది. దీంతో.. ఆమె నిర్ణయం వార్తగా మారింది.

ఈ విషయాన్ని తాజాగా యూఎస్ ఎయిర్ ఫోర్సుకు సంబంధించిన అధికారి ప్రకటించారు. యూఎస్ ఎయిర్ ఫోర్సు సీ17 విమానం ఎక్కిన కాసేపటికే ఆమెకు నొప్పులు రావటం.. విమానం గమ్యస్థానానికి చేరుకున్న వెంటనే ఆమెకు వైద్య సదుపాయాలు అందేలా ఏర్పాట్లు చేయటం తెలిసిందే. విమానం ల్యాండ్ అయిన వెంటనే.. వైద్యులు ఆమెకు విమానంలోనే ప్రసవం చేశారు. తాజాగా తల్లీబిడ్డా క్షేమంగా ఉన్న వేళ.. తన ముద్దుల కుమార్తెకు.. తమ ఇద్దరి ప్రాణాల్ని కాపాడిన ఎయిర్ క్రాఫ్ట్ కోడ్ నేమ్ అయిన.. ‘రీచ్’ పేరు పెట్టుకోవాలని నిర్ణయంయ తీసుకున్నారు.

డెలివరీ అనంతరం.. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకున్న ఆమె కుటుంబ సభ్యులు.. తమ ఇంట్లోకి ప్రవేశించిన ‘రీచ్’ను తీసుకొని.. తమ గమ్యస్థానం వైపు వెళ్లినట్లుగా అధికారులు చెబుతున్నారు. 
Tags:    

Similar News