ఢిల్లీ సీఎంగా చేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్ ఇటీవలే మరణించారు. ఆయితే షీలా దీక్షిత్ మరణంపై తాజాగా ఆమె కుమారుడు రాసిన లేఖ కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. షీలా దీక్షిత్ మృతికి కాంగ్రెస్ సీనియర్ నేత పీసీ చాకోనే కారణమని ఆమె కుమారుడు సందీప్ దీక్షిత్ లేఖలో బాంబు పేల్చారు.
ఈ లేఖ వెలుగులోకి రాగానే కాంగ్రెస్ సీనియర్ నేతలు వేగంగా స్పందించారు. షీలా మరణానికి కారణమైన పీసీ చాకోను ఏఐసీసీ పదవి నుంచి తొలగించాలంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని డిమాండ్ చేశారు. ఇక షీలా చావుకు పీసీచాకోతోపాటు ఢిల్లా కాంగ్రెస్ ఏఐసీసీ ఎంత వరకు కారణమో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఇక తన తల్లి మరణంపై తాను రాసిన లేఖ లీక్ కావడంపై ఆమె కొడుకు సందీప్ దీక్షిత్ స్పందించారు. ఈ లేఖ.. మా తల్లి చావుకు కారణం మీడియాతో ప్రజలతో చర్చించేది కాదని స్పష్టంచేశారు. పీసీ చాకోకు, నాకు మధ్య మాత్రమే గొడవ ఇదీ.. ఆయనకు రాసిన లేఖ ఇదీ.. ఈ లేఖతో మీడియాకు - మరెవరికీ సంబంధం లేదు.. చాకో లీక్ చేస్తే దానికి సమాధానం ఆయనే చెప్పాలంటూ సందీప్ దీక్షిత్ స్పష్టంచేశారు. సోనియాగాంధీ ఆయనపై ఎలాంటి చర్య తీసుకుంటారో ఎదురుచూస్తానని అన్నారు.
షీలా దీక్షిత్ మరణానికి ముందు బ్లాక్ కాంగ్రెస్ కమిటీలను రద్దు చేశారు. దీనిపై ఏఐసీసీ ఢిల్లీ ఇన్ చార్జి పీసీ చాకోకు, షీలాకు పెద్ద గొడవ. మాటల యుద్ధం జరిగింది. ఆ మనస్థాపంతోనే షీలా మరణించినట్టు తెలిసింది.. దీంతో ఆమె కుమారుడు షీలా మరణంపై చాకోకు లేఖ రాయగా అది కాస్తా లీక్ అయ్యింది.కాంగ్రెస్ ను షేక్ చేస్తోంది.