హైదరాబాద్ నగరం క్రమంగా సెల్ ఫోన్ సిటీగా మారిపోతోంది. ప్రముఖ సెల్ ఫోన్ తయారీ సంస్థలే కాదు, కొత్తగా ఆ రంగంలోకి అడుగుపెడుతున్నవారు కూడా భాగ్యనగరంలోనే తమ యూనిట్ ఏర్పాటుచేసుకోవాలని భావిస్తున్నారు. తాజాగా వన్నె తగ్గని బాలీవుడ్ సుందరి, యోగా మహారాణి శిల్పాషెట్టి కూడా హైదరాబాద్ లోనే తన సెల్ ఫోన్ రింగుమనిపించాలని అనుకుంటున్నారట. ఈ మేరకు ఆమె తెలంగాణ పరిశ్రమల శాఖ అధికారులతో ఆమె ఇప్పటికే దీనిపై చర్చలు జరిపినట్లు సమాచారం.
హైదరాబాద్ నగరంలో ఇప్పటికే మైక్రోమ్యాక్స్ - సెల్ కాన్ కంపెనీలు తమ యూనిట్లను ఏర్పాటు చేసుకున్నాయి. శిల్పాషెట్టి కూడా తమ సంస్థ వివాన్ ను ఇక్కడే ఏర్పాటు చేయాలనుకుంటున్నారట. శిల్పాషెట్టి కుమారుడు వివాన్ పేరుతో ఆ సంస్థ ఏర్పాటైంది. మేకిన్ ఇండియా వారోత్సవాల సందర్భంగా శిల్ప అక్కడికి భర్త రాజ్ కుంద్రాతో కలిసి వచ్చారు. అక్కడ తెలంగాణ స్టాల్ వద్ద సుమారు గంటసేపు వారు ఉన్నారు. అక్క డ అధికారులతో వారిద్దరూ చర్చలు జరిపారు. ప్రాథమికంగా కొన్ని వివరాలు తెలుసుకున్నవారు సమగ్ర చర్చల కోసం త్వరలో హైదరాబాద్ వస్తామని అధికారులతో చెప్పారు. సో.... అన్నీ అనుకూలిస్తే హైదరాబాద్ లో శిల్పా షెట్టి సెల్ ఫోన్ రింగురింగుమనడం ఖాయంగా కనిపిస్తోంది.