బాబుపై మోత్కుప‌ల్లి ఫైర్ అవ‌డం ఖాయం

Update: 2016-08-20 22:30 GMT
ఏడాది కింద‌టి నుంచి పెద్ద ఎత్తున జ‌రుగుతున్న ప్ర‌చారం ఒక‌టి గుర్తుండే ఉంటుంది. బీజేపీ మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీకి జాతీయ స్థాయిలో ప‌ద‌వులు ద‌క్క‌నున్నాయి - అందులో ముఖ్యంగా తెలంగాణ టీడీపీ సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులుకు ఏదో ఒక రాష్ట్రానికి గ‌వ‌ర్న‌ర్‌ గా పంప‌నున్నార‌ని టాక్ న‌డిచింది. అది జ‌రిగిన‌ప్ప‌టి నుంచి మూడు ద‌ఫాలుగా గ‌వ‌ర్న‌ర్‌ ల నియామ‌కం జ‌రిగిన మోత్కుప‌ల్లికి మొండిచేయే మిగిలింది. అయితే తాజాగా వెలుగులోకి వ‌చ్చిన ఒక వార్త వింటే మోత్కుప‌ల్లి న‌ర్సింహులు త‌మ పార్టీ అధినేత చంద్ర‌బాబుపై ఫైర్ అవుతార‌ని అంటున్నారు.

తాజాగా జ‌రిగిన గ‌వ‌ర్న‌ర్ల నియామ‌కాల్లో బీజేపీకి చెందిన సీనియ‌ర్ నేత‌లనే ఆయా రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్లుగా పంపించిన సంగ‌తి తెలిసిందే. పేరుకు ఎన్డీఏ ప్ర‌భుత్వం పేరుతో అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ వారంతా బీజేపీ నాయ‌కులే కావ‌డంపై ఆ పార్టీ మిత్ర‌ప‌క్ష‌మైన శివ‌సేన మండిప‌డింది. గ‌వర్నర్ పోస్టులు బీజేపీ వారికేనా అని శివసేన ప్రశ్నించింది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలలోని ప్రతిభావంతులైన వారికి కూడా పదవి ఇవ్వాలని శివసేన త‌న‌ అధికారిక పత్రిక సామ్నా సంపాదకీయం లో పేర్కొంది. ఎన్డీయే అధికారంలోనికి వచ్చిన అనంతరం ఇప్పటి వరకూ నియమించిన గవర్నర్లందరూ బీజేపీ వారేనని పేర్కొంది. ఇది మిత్రుత్వాన్ని గౌరవించ‌డం అవుతుందా అని నిల‌దీసింది.

శివ‌సేన ప్ర‌శ్నించిన తీరుతో తెలంగాణ‌లోని పార్టీ నేత‌లు లోలోప‌ల చ‌ర్చించుకుంటున్నారు. శివ‌సేన వ‌లే త‌మ నాయ‌కుడు చంద్ర‌బాబు సైతం క‌నీసం అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తే వీలైతే గ‌వ‌ర్న‌ర్ గిరీ లేదంటే ఏదో ఒక జాతీయ స్థాయి నామినేటెడ్ ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని అంటున్నారు. త‌మ అధినేత శివ‌సేన తీరును గ‌మ‌నించాల‌ని ప‌లువురు న‌సుగుతున్నారు.
Tags:    

Similar News